తెలుగు సిని పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా యంగ్ హీరోయిన్స్ హవానే కొనసాగుతోంది. కొత్త కొత్త హీరోయిన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. ఇతర భాషలలో నుంచే కాకుండా తెలుగు అమ్మాయిలు కూడా తమ నటనతో అందంతో మరింత క్రేజ్ సంపాదించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏ ఒక్క సినిమాలో కూడా నటించని ఒక ముద్దుగుమ్మ త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది కానీ స్టార్ హీరోయిన్ రేంజిలో క్రేజ్ ని అప్పుడే సంపాదించుకుంది. ఆమె ఎవరో కాదు సురేఖ వాణి కూతురు సుప్రీత.


నిరంతరం ఈ తల్లి కూతుర్లు సోషల్ మీడియాలో చేసేటువంటి హంగామా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటాయి. త్వరలోనే సుప్రీత హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన అమరదీప్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీత తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.


ఇండస్ట్రీలో తనకు ముగ్గురు మీద క్రష్ ఉందంటూ తెలియజేసింది. ఆ హీరోలతో ఎవరితో డేటింగ్ డేటింగ్ చేస్తావంటూ యాంకర్  ప్రశ్నించగా?.. హీరో విజయ్ దేవరకొండ, అఖిల్ తో డేటింగ్ చేస్తానని వెల్లడించింది.. మరో హీరో నవీన్ పోలీస్ శెట్టి గురించి మాట్లాడుతూ చాలా బ్యాడ్లి క్రషింగ్ అంటూ వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే సుప్రీత తన ఫస్ట్ కిస్ గురించి కూడా మాట్లాడుతూ.. తాను స్కూల్ డేస్ లో ఉన్న సమయంలోనే తాను ఫస్ట్ కిస్ ఎక్స్ పీరియన్స్ చేశానని వెల్లడించింది. ఈ విషయం విన్న వెంటనే నేటిజన్స్ ఇలా రియాక్ట్ అవుతూ  స్కూలుకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులోనే ఇలాంటి పనులు చేసావా అంటూ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో  క్రేజ్ పెంచుకున్న తరువాతే హీరోయిన్గా అడుగుపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: