- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న  సినిమా ల‌లో సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న రెండో సినిమా ఇది. గ‌తంలో ఎప్పుడో 2012లో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. అప్ప‌ట్లో ప‌దేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు గ‌బ్బ‌ర్‌సింగ్ రూపంలో హిట్ వ‌చ్చింది. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత మ‌ళ్లీ హ‌రీష్ - ప‌వ‌న్ ఎప్పుడు క‌లిసి ప‌ని చేస్తారా ? అని ప‌వ‌న్ , హ‌రీష్ అభిమానులు ఆతృత‌తో ఎదురు చూస్తున్నారు. మ‌ళ్లీ ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ రూపంలో వారి కోరిక నెర‌వేర‌నుంది. ఇక ఓజీ త‌ర్వాత ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.


పవన్ అభిమానులకి ఫీస్ట్ సినిమాగా తెర‌కెక్కుతోన్న భ‌గత్‌సింగ్‌ షూటింగ్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ వచ్చేసింది. రీసెంట్ గానే పవన్ ఈ సినిమా షూటింగ్ ని ఈ వారంలోనే ముగించేస్తామ‌ని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయిన‌ట్టు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌ సినిమా హీరోయిన్ బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా క్లారిటీ ఇచ్చింది. పవన్ తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసుకొని ప‌వ‌న్ తో క‌లిసి ప‌ని చేయ‌డంపై ఫుల్ ఖుషీ ఫీల్ అయ్యింది. పవన్ తో వర్క్ చేయడం తన లైఫ్ టైం మెమరీగా గుర్తు ఉంచుకుంటాను అని ఆమె చెబుతుంది. ఇలా పవన్ తీసిన సెల్ఫీకి ఫోజ్ ఇచ్చి తన ఆనందాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: