
ఈ సినిమా లో ఢిఫరెంట్ షేడ్స్ లో బన్నీ కనిపించబోతున్నాడు అనే సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమా కచ్చితంగా గ్లోబల్ స్టైల్‌లో తెరకెక్కి, బన్నీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అట్లీ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో కష్టపడుతున్నాడట. కొత్తగా, విభిన్నంగా కనిపించే టెక్నాలజీలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని తెలిసి ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరిగింది. అంతేకాదు ఈ సినిమాలో ముగ్గురు బ్యూటీస్ తో రొమాన్స్ చేయబోతున్నాడట బన్నీ. అంతేనా అల్లు అర్జున్ తన కెరీయర్ లోనే ఫస్ట్ టైం మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడట .
అంతేకాదు, బన్నీ అభిమానులను బాగా ఆకట్టుకునేలా హార్ట్ టచింగ్ సెంటిమెంట్‌ను కూడా ఈ సినిమాలో ప్రత్యేకంగా ప్లాన్ చేశారట అట్లీ అనేది ఇన్సైడ్ టాక్. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా, అల్లు అర్జున్ పాత్రకు ఆయన అసలు పేరు కాకుండా అభిమానులు ముద్దుగా పిలిచే "బన్నీ" అనే పేరునే పెట్టారట. అసలు విషయం ఏంటంటే, అల్లు అర్జున్‌కి కన్నా ఆయన ఫ్యాన్స్ "బన్నీ" అని పిలవడానికే ఎక్కువ ఇష్టపడతారు. అదే ఆయనకు దగ్గరగా కలిసి వచ్చిన పేరు. ఆయన కెరీర్‌లో "బన్నీ" సినిమా తర్వాత నుంచి ఈ పేరు ఆయనకు లక్‌గా మారిపోయింది.అందుకే ఈసారి కూడా అట్లీ ప్రత్యేకంగా ఆ పేరునే పాత్రకు ఫిక్స్ చేశాడని మేకర్స్ వర్గాల ద్వారా లీకైంది. ఈ న్యూస్ బయటకు రాగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ఆనందంగా “సెంటిమెంట్‌తో కొట్టావు బాసు” అంటూ నాటిగా ట్రెండ్ చేస్తున్నారు. చూస్తుంటే అట్లీ ఈసారి గట్టి హిట్ కొట్టేలానే ఉన్నాడు..!!