పై ఫొటోలోని వ్యక్తిని చూస్తుంటే రాఘవేంద్రరావు గుర్తొస్తున్నాడా ... ఇతను టాలీవుడ్ ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్రరావు తమ్ముడు కె.ఎస్. ప్రకాశ్. విన్పెంట్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ప్రకాశ్ అడవి రాముడు సినిమాకు ఆపరేటివ్ కెమేరామెన్. ఆ తర్వాత నెమ్మదిగా డీఓపీ అయ్యాడు. పదహారేళ్ల వయసు డివోపి గా అతని మొదటి సినిమా. ఆ తర్వాత డ్రైవర్ రాముడు మొదలుకుని రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నిటికీ ఒక్క మేజర్ చంద్రకాంత్ మినహాయిస్తే... ప్రకాశే కెమేరా దర్శకుడు. రీసెంట్ రాఘవేంద్రరావు టాక్ షో సౌందర్యలహరిలోనూ ప్రకాశ్ ప్రస్తావన విస్తృతంగా వచ్చింది. ఇంతకీ ప్రకాశ్ ఎవరో కాదు. నటి జీ.వరలక్ష్మికీ దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావుకీ పుట్టిన కుమారుడు.


రాఘవేంద్రరావు కీ , ప్రకాశ్ కీ తండ్రి ఒక్కడే. తల్లులే వేరు. అయితే ఇద్దరూ సొంత అన్నదమ్ములకన్నా ఎక్కువగా ఉండేవారు. ప్రకాశ్ తో మోహన్ బాబు రెండు సినిమాలు డైరక్ట్ చేయించాడు కూడా. అందులో రౌడీగారి పెళ్లాం హిట్టైంది కూడా. జస్టిస్ చౌదరి సినిమాలో చట్టానికి న్యాయానికి జరిగే ఈ సమరంలో పాట చిత్రీకరణ సమయంలో ప్రకాశ్ పడ్డ కష్టం చాలానే ఉంది. ప్రకాశ్ ఆకస్మిక మరణం రాఘవేంద్రరావును బాగా ఇబ్బంది పెట్టింది.
అలాగే తాను బతికుండగానే కొడుకు చనిపోవడం తనను బాగా కృంగదీసిందని వరలక్ష్మి చనిపోయే వరకు చెప్తూ ఉండేది. పాటల చిత్రీకరణ సందర్భంలో రాఘవేంద్రరావు, ప్రకాశ్ ఇద్దరూ చాలా కేర్ తీసుకునేవారు.  అలాగే యాక్షన్ సీన్స్ తీయడంలోనూ ప్రకాశ్ ది ప్రత్యేకముద్రే. ఎన్టీఆర్ గజదొంగ చిత్రంలో ఛేజింగ్ సీన్స్ చాలా బాగా తీశాడనే పేరొచ్చింది.  ప్రకాశ్ మరణానంతరం మళ్లీ రాఘవేంద్రరావు తన సినిమాకు విన్సెంట్ తోనే కెమేరా చేయించుకున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: