సామాన్య జనాలకే కాదు స్టార్ హీరోల కి హీరోయిన్లకి వారి పిల్లలకి కూడా కొన్ని షాకింగ్ సంఘటనలు బాధాకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలా తాజాగా తన కూతురికి ఏర్పడిన ఒక వింత బాధాకరమైన అనుభూతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటుడు.ఓ హీరో 13 ఏళ్ల కూతుర్ని నగ్న ఫోటోలు పంపమని మెసేజ్ లు చేశారట. మరి ఇంతకీ తెర వెనక ఏం జరుగుతోంది.. హీరో కూతురికి నగ్న ఫోటోలు పంపమని అడిగింది ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అంటే తెలియని వారు ఉండరు. అయితే అలాంటి అక్షయ్ కుమార్ కూతురు నితారాకీ ఒక షాకింగ్ అనుభూతి ఎదురైందట.ఈ విషయాన్ని తన తల్లి దగ్గర చెప్పుకొని బాధపడిందట.

ఇక అదేంటంటే నితారా ఓ ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఒక అపరిచిత వ్యక్తి ఆమెకు మెసేజ్ పెట్టి అమ్మాయా అబ్బాయా అని తెలుసుకొని అమ్మాయి అని తేలడంతో నీ న్యూడ్ ఫోటోలు పంపమని అడిగారట. అయితే ఈ విషయం అడగడంతోనే నితారా వెంటనే గేమ్ నుండి బయటికి వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి తన తల్లి దగ్గరికి వెళ్లి బోరున ఏడ్చిందట.అలా తన భార్య చెప్పడంతో ఈ విషయం తెలుసుకున్న అక్షయ్ కుమార్ తాజాగా ముంబైలో జరిగిన సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం లో దీన్ని బయటపెట్టారు. చిన్న పిల్లలకు సైబర్ నేరల గురించి సైబర్ ముప్పు గురించి అవగాహన కల్పించాలని, ముఖ్యంగా 7,8, 9, 10 తరగతులు చదివే పిల్లలకు కచ్చితంగా ఒక సైబర్ పీరియడ్ ని కేటాయించి వారికి సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ ప్రోగ్రాం లో వేడుకున్నారు.
అంతేకాదు చాలామంది చిన్నపిల్లలు సైబర్ నేరాలకు బలి అవుతున్నారని,సైబర్ క్రైమ్ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అక్షయ్ కుమార్ మాట్లాడిన ఈ మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ అక్షయ్ కుమార్ లాంటి దిగ్గజ స్టార్ హీరో కూతురికే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందంటే బయటికి రాని సామాన్య జనాలకు సంబంధించిన ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి చిన్న పిల్లలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: