తమిళ నటుడు ధనుష్ తాజాగా ఇడ్లీ కడాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ ని అక్టోబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాను అక్టోబర్ 1 వ తేదీనే తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. తెలుగు భాషలో ఈ మూవీ ని ఇడ్లీ కొట్టు అనే పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు ప్రస్తుతం దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి తమిళ నాడు ఏరియాలో 20.30 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి రెండు రోజుల్లో 1.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. కర్ణాటక ఏరియాలో 2.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , కేరళ లో 45 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షలు , ఓవర్ సిస్ లో 4.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెండు రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 14.65 కోట్ల షేర్ ... 29.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 44 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 30.35 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకునే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: