
తన చక్కటి నటనతో పాటు అందం మరియు సహజమైన ఎక్స్ప్రెషన్స్ తో ఈ బ్యూటీ దక్షిణాదిలో బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది . ఇక ఇప్పుడు క్రేజ్ ని హిందీ ఆడియన్స్ ముందు కూడా నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది . ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా కుమారుడు యశ్వర్థన్ అహుజా హీరోగా నటించబోతున్నట్లు సమాచారం .
వాట్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ మూవీని నిర్మించనుందని దీనికి సాజిత్ ఖాన్ దర్శకత్వం వహించే అవకాశం బలంగా ఉందని టాక్ నడుస్తుంది . అంతేకాకుండా దక్షిణాదిలో విజయవంతమైన ఓ సినిమా రీమేక్ గా ఈ కథను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి . ఇక ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది . బాలీవుడ్ కుదిరితే దక్షిణాలతో పాటు ఉత్తరాదిలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునే అవకాశం ఉంది . దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఉన్న త్రిష మరియు నయనతార అదేవిధంగా సమంత లాగా బాలీవుడ్ లో కూడా తన ప్రతిభను చాటుకోగలరని కృతి కూడా చాలా ఆతృతంగా ఉందట . మరి ఈమె ఆత్రుత ఎంతవరకు నెరవేర ఉందో చూడాలి .