
అలాంటి సమయంలో సమంత - పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ చేయడం నెట్టింట చర్చనీయాంశమైంది. “సమంత పవన్ కళ్యాణ్‌ను ఎందుకు కలవాలి?” అంటూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అని అంటుండగా, మరికొందరు మాత్రం “ఇది నిజమే అయ్యుంటుంది” అని నమ్ముతున్నారు.ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, సమంత త్వరలోనే తన బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడమూరు ని పెళ్లి చేసుకోబోతుందట. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా ఆహ్వానించడానికి అపాయింట్మెంట్ కోరిందని చెబుతున్నారు. ఈ వార్త వెలుగులోకి రాగానే ఫ్యాన్స్ మళ్లీ చర్చలు మొదలు పెట్టారు. “సమంత నిజంగానే రెండో పెళ్లి చేసుకోబోతుందా?” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఇటీవలే దసరా సందర్భంగా సమంత కొత్త ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే పోస్టుతో కొంతమంది “ఇదే ఆమె పెళ్లి కోసం కొత్త ఇంటి సెట్‌అప్ అయి ఉంటుంది” అని కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ వార్త రావడంతో ఆ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.సినీ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్, సమంత మధ్య మంచి స్నేహబంధం ఉంది. వారు కలిసి “అత్తారింటికి దారేది” సినిమా సమయంలో బాగా క్లోజ్ అయ్యారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఇద్దరి మధ్య స్నేహం కూడా కొనసాగింది. ఇప్పుడు సమంత తిరిగి పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా కలవాలనుకోవడం వెనుక ఏదో ప్రత్యేక కారణం ఉంటుందనే అనుమానం వ్యక్తమవుతోంది.
అయితే ఈ వార్తకు సంబంధించి సమంత గానీ, ఆమె టీమ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే కారణంగా ఇది నిజమా? ఫేక్ న్యూసా? అన్న సందేహం ఇంకా కొనసాగుతోంది.ఏదేమైనా, సోషల్ మీడియాలో సమంత – పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ న్యూస్ పెద్ద సంచలనం రేపుతోంది. ఈ విషయం మీద సమంత స్వయంగా స్పందించే వరకు ఈ రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు. ఇక ఆమె రెండో పెళ్లి వార్తలు, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కలయిక… ఇవన్నీ కలిపి సోషల్ మీడియాను ఒక్కసారిగా హీట్ చేశాయి. ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే —“సమంత పవన్ కళ్యాణ్‌ను ఎందుకు కలుస్తోంది? దానికి సమాధానం చెప్పేది మాత్రం సమంతనే..!