
దీపికా మాట్లాడుతూ —“స్టార్ హీరోలు రోజుకి ఎనిమిది గంటలపాటు మాత్రమే వర్క్ చేస్తారు. శనివారం, ఆదివారం వారికి సెలవు కూడా ఉంటుంది. వాళ్లకు అది న్యాయం, కానీ అదే న్యాయం హీరోయిన్లకు ఎందుకు ఉండదు? ఒక సినిమా కోసం హీరో ఎంత కష్టపడతాడో, హీరోయిన్ కూడా అంతే కష్టపడుతుంది. అయితే ఎందుకు మాకు వేరే రూల్స్? ఎందుకు వేరే ట్రీట్‌మెంట్?”అంటూ నేరుగా ప్రశ్నించింది.ఈ మాటలపై చాలామంది హీరోయిన్‌లు మౌనం పాటించినా, “అర్జున్ రెడ్డి” ఫేమ్ శాలిని పాండే మాత్రం దీపికాకు బహిరంగంగా సపోర్ట్ ఇచ్చింది.
శాలిని మాట్లాడుతూ —“నేను స్కూల్లో చదువుకునే రోజుల నుంచే దీపికా పదుకొనేకి అభిమానిని. ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమె జర్నీ అద్భుతంగా సాగింది. ఆమె ఏది మాట్లాడినా దానికి వెనుక నిజాయితీ ఉంటుంది. తాను ఏది అనుకుంటుందో అది నిర్భయంగా చెప్పగలిగే వ్యక్తి. అలాంటి ఆర్టిస్టు ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం. ఆమె మాట్లాడిన దాంట్లో తప్పు ఏమీ లేదు. మేము కూడా మనుషులమే కదా… మాకు కూడా చిన్నపాటి బ్రేక్‌లు కావాలి. మేము సర్జరీ చేసే డాక్టర్లు కాదు కదా!”అంటూ బలంగా స్పందించింది.". ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే — శాలిని పాండే తొలి సినిమా “అర్జున్ రెడ్డి”కి దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే. ఇప్పుడు అదే దర్శకుడిపై పరోక్షంగా విమర్శిస్తున్న హీరోయిన్‌కు ఆమె సపోర్ట్ ఇవ్వడం ఇండస్ట్రీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.కొంతమంది నెటిజన్లు దీన్ని “సందీప్‌పై పరోక్ష ఘాటు రియాక్షన్”గా చెబుతుండగా, మరికొందరు “నిజమే — హీరోయిన్లు కూడా మనుషులే, వాళ్లకూ హక్కులున్నాయి” అంటూ దీపికా–శాలిని ఇద్దరికీ సపోర్ట్ చేస్తున్నారు.
అయితే మరోవైపు కొంతమంది మాత్రం వీళ్ళిద్దరినీ విమర్శిస్తూ —“ఇలా మాట్లాడితే ఇక మీకు ఆఫర్లు రావు”, “ఇండస్ట్రీలో ఉండాలంటే కాస్త కంప్రమైజ్ కావాలి”అంటూ ఘాటుగా ట్రోల్స్ చేస్తున్నారు.ఏదేమైనా, ఈ వివాదం చుట్టూ తిరుగుతున్న మాటలు చూస్తుంటే, దీపికా పదుకొనే–సందీప్ రెడ్డి వంగా ఎపిసోడ్ ఇండస్ట్రీలో ఇంకా చల్లబడలేదనేది స్పష్టమవుతోంది. శాలిని పాండే చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చర్చల హీట్‌ను మరింత పెంచేస్తున్నాయి.