
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పాత్రలో గట్టి వేరియేషన్స్ ఉంటాయని టాక్. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు సినిమాలో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తాయట. ఆ భాగంలో ఫాదర్ సెంటిమెంట్ చాలా హృదయాన్ని తాకేలా ఉంటుందని సమాచారం. ఈ ఎమోషనల్ సీన్స్ విజయం సాధిస్తే, అది విజయ్ కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక విజయ్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుండటంతో, ఈ జంట స్క్రీన్‌పై కొత్త ఫ్రెష్ ఫీల్ ఇవ్వబోతోందని సినీ వర్గాల అంచనా. విజయ్ ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు.
ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంటనే రౌడీ జనార్ధన్ సెట్స్‌పైకి వెళ్లనున్నారు. దిల్ రాజు బ్యానర్, రవి కిరణ్ కోలా రైటింగ్ స్టైల్, విజయ్ దేవరకొండ ఎనర్జీ ఈ ముగ్గురి కలయికతో టాలీవుడ్‌లో మరో పక్కా మాస్ ఎంటర్టైనర్ జన్మించబోతుందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అభిమానులు ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.