
దీంతో విక్రమ్ సినిమాలకు మార్కెట్లో రోజురోజుకీ డిమాండ్ తగ్గిపోతున్నట్లు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తంగలాన్ సినిమా కోసం భారీగానే కష్టపడ్డ విక్రమ్ కానీ బొమ్మ డిజాస్టర్ గా మిగిలింది. ఇక వీరా ధీర శూరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కనీసం రూ .70 కోట్ల కూడా దాటలేదట. ప్రస్తుతం హీరో విక్రమ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలు పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదనే విధంగా కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. తంగలాన్ సినిమా కంటే ముందుగా విక్రమ్ 63వ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టుని అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత డైరెక్టర్ తప్పుకున్నారు. దీంతో ప్రొడక్షన్ హౌస్ శాంతి టాకీస్ డైలమాలో పడిపోయింది.
తన 63వ సినిమా కోసం విక్రమ్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని.. ప్రస్తుతం విక్రమ్ మార్కెట్ కి అంత లేకపోవడంతో చిత్ర బృందం వెనుకడుగు వేశారనే విధంగా కోలీవుడ్లో వినిపిస్తున్నాయి.. అలాగే ఓటిటి రైట్స్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ వంటి వాటిలో కూడా అనుకున్నంత స్థాయిలో విక్రమ్ సినిమాలకు మార్కెట్ కనిపించడం లేదని, దీంతో విక్రమ్ తన సినిమాలకు రెమ్యూనరేషన్ విషయంలో తగ్గించుకోవాలని కొన్ని నిర్మాణ సంస్థలు కోరాయట. దీంతో హీరో విక్రమ్ కూడా ఈ విషయం పైన కొంత వెనక్కు తగ్గి రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి.అలాగే విక్రమ్ 64వ సినిమాని డైరెక్టర్ ఫ్రేమ్ కుమార్ విక్రమ్ సన్నహాలు జరుపుతున్నట్లు వినిపిస్తున్నాయి.