
శ్రీకాళహస్తి వివాదం: 'హత్యాయత్నం' వీడియో సంచలనం:
శ్రీకాళహస్తి విషయానికి వస్తే, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వినుతి, ఆమె భర్తపై టీడీపీ అధినేత చంద్రబాబును హత్య చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి అన్న ఆరోపణలతో కూడిన ఒక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వాస్తవానికి నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, దానిపై రాయలసీమ జిల్లాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అయితే, ఈ వ్యవహారంపై జనసేన గానీ, టీడీపీ గానీ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు.
కురుపాం దాడి: కూటమిలో అంతర్గత కలహాలు పరాకాష్టకు :
ఇక, కురుపాం నియోజకవర్గంలో జనసేన ఎంపీపీపై టీడీపీ నాయకులు బహిరంగంగా దాడి చేయడం, తీవ్రంగా కొట్టడం సంచలనం సృష్టించింది. దాడి చేసిన అనంతరం వారే ఆ ఎంపీపీని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చి, అక్కడి నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారం అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలలో తీవ్ర అంతర్గత వివాదంగా మారింది. కూటమిలో అంతర్గతంగా జరుగుతున్న దుమారాలకు ఇది పరాకాష్టగా కూడా మారిందని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు.
ఈ రెండు కీలక పరిణామాలపై స్పందించేందుకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్న క్రమంలోనే, ఆ పార్టీ అధినేత జగన్ లండన్ నుంచి ముఖ్య ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. జనసేన వ్యవహారాలపై ఎవరూ స్పందించవద్దని, మాట్లాడవద్దని ఆయన స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వైసిపి నాయకులు ప్రెస్ మీట్‌లు పెట్టి మాట్లాడాలని అనుకున్నప్పటికీ, అధినేత ఆదేశాల మేరకు వెనక్కి తగ్గినట్టు తెలిసింది. జనసేన విషయాల జోలికి పోవద్దని, కేవలం ఆ విషయాలకు దూరంగా ఉండాలని వైసీపీ నాయకులు నిర్ణయించుకున్నట్టు తాడేపల్లి వర్గాలు తెలిపాయి. అయితే, వైసీపీ ఈ మౌనాన్ని ఎన్నాళ్లు కొనసాగిస్తుంది అనేది చూడాలి. రాజకీయంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న కొన్ని కీలక మార్పుల కారణంగానే వైసీపీ అధినేత ఈ విధమైన వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారన్న వాదన కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తుండడం గమనార్హం.