టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో హీరోయిన్ ఇలియానా కూడా ఒకరు. ఒకానొక సమయంలో దర్శకనిర్మాతలకు డేట్లు అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఇలియానాకు ఇప్పుడు అవకాశాలు లేవు.ఎంతోమంది హీరోలకు జంటగా నటించిన ఇలియానా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత తన కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ వైపు చూడకపోవడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అలాంటి సమయంలోనే ప్రేమలో విఫలం కావడం వల్ల కొన్నేళ్లపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయి అధిక బరువుతో ఇబ్బంది పడిందనే వార్తలు వినిపించాయి.


కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని మరొక వ్యక్తి మైఖేల్ డోలన్  ను రహస్యంగా వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తనకు వివాహమైన విషయాన్ని తెలియజేసింది. ఆ తర్వాత రెండవ బిడ్డ  కీను రాఫే డోలన్ కు జన్మనిచ్చింది. కానీ తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోను బట్టి చూస్తే ఇలియానా ఇప్పుడు మూడో బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడానికి బేబీ బంప్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా కనిపిస్తోంది ఇలియానా.



ఈ వీడియోలో ఇలియానా బేబీ బంప్ తో కనిపిస్తూ, ఉయ్యాలను సర్దుతూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ విషయం విన్న అభిమానులు కూడా ఇలియానాకు కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు. దీంతో మరి కొంతమంది మాత్రం ఏంటి ఇలియానా ఇంత స్పీడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చివరిగా 2024 లో హిందీ చిత్రాలలో నటించింది. తెలుగు సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే 2018 లో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేక పోయింది ఇలియానా. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్ సాంగులలో కూడా కనిపించింది.  మరి మూడోసారి ప్రెగ్నెంట్ విషయంపై ఇలియానా ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: