
ఆ పాటతో బాలయ్య పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ ఆర్క్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేయాలని యూనిట్ భావిస్తోంది.
ఇందులో బాలయ్య పాత్ర మాఫియా నేపథ్యంతో మిళితమై ఉంటుందని, ఆ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చిత్రానికి ముఖ్య ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని స్వయంగా ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ “ గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈసారి మా గర్జన మరింత గట్టిగా వినిపించనుంది. బాలయ్య గారితో మళ్లీ పనిచేయడం గర్వంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం అవుతుంది ” అని తెలిపారు.
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఇది 111వ సినిమా కావడంతో అభిమానులు ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. మాస్, ఎమోషన్, యాక్షన్, ఎలివేషన్‌ల మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్‌కి మరో భారీ పండుగలా మారబోతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.