తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ తాజాగా మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటించాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... భాను భోగ వరకు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సూర్య దేవర నాగ వంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నవీన్ చంద్రమూవీ లో విలన్ పాత్రలో నటించగా ... నరేష్ , రాజేంద్ర ప్రసాద్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

కొంత కాలం క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను అక్టోబర్ 31 వ తేదీ సాయంత్రం నుండి ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా చాలా ప్రాంతాలను ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు మాస్ జాతర మూవీ ప్రీమియర్స్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 40 లక్షల వరకు కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా ఈ మూవీ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనాల నుండి లభిస్తుంది. ఒక వేళ ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారా మంచి టాక్ గనుక వచ్చినట్లయితే ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని రవితేజ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రీమియర్స్ తో ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt