తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావు వారసులు అయినటువంటి హరికృష్ణ, బాలకృష్ణ రాజకీయాల్లో కొనసాగినారు. బాలకృష్ణ అయితే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గా ఉన్నాడు. అయితే టిడిపి లోకి నందమూరి అస్సలు సిసలైన వారసులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో ఆసక్తి ఉందని మనందరికీ తెలిసిందే.
Image result for kalyana ram
అయితే కళ్యాణ్ రామ్ కు రాజకీయాల్ పట్ల ఆసక్తి ఉందొ లేదో చాలా మందికి తెలియదు. అయితే తన సినిమా అయినటువంటి ఎమ్మెల్యే రాజకీయ బ్యాక్ గ్రౌండ్ తో వస్తుండటం తో తన అభిమానులు రాజకీయాల్లో రావాలని అడుగుతున్నరంటా.. రీసెంట్ గా జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో పోసాని కూడా తన స్టయిల్ లో కల్యాణ్ రామ్ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడారు. "తెలుగుదేశం పార్టీ వాళ్లెవరిదో కాదు, ఆ పార్టీ మీద సర్వహక్కులు మీవి" అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
Image result for kalyana ram
అయితే పోసానితో పాటు ఎంతమంది ఎన్ని విధాలుగా గుచ్చినా కల్యాణ్ రామ్ మాత్రం తన పొలిటికల్ ఎంట్రీపై అప్పట్లో రియాక్ట్ అవ్వలేదు. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ ప్రశ్నలు ఎక్కువవ్వడంతో ఫైనల్ గా తన రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ ఇచ్చాడు కల్యాణ్ రామ్. "మా తాతగారి ప్రభావం మా అందరిపై ఉంటుంది. మా కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటారు. రాజకీయాల్లోకి రావాలని నాక్కూడా ఉంది. కచ్చితంగా ఏదో ఒకరోజు రాజకీయాల్లోకి వస్తాను. కాకపోతే ఆ టైమ్ ఇప్పుడు రాలేదు. దానికింకా టైమ్ ఉంది." తన పొలిటికల్ ఎంట్రీపై ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ వెర్షన్ ఇది.


మరింత సమాచారం తెలుసుకోండి: