సినీ ఇండస్ట్రీలో ఏ చిన్న సమస్య వచ్చినా..వెంటనే స్పందిస్తున్నారు ప్రముఖ  నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ. ఓ సినిమా థియేటరులో తనకు ఎదురైన అనుభవాన్ని కన్నీరు పెట్టుకుంటూ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ హరితేజ చెప్పుకోగా, దాన్ని చూసిన తమ్మారెడ్డి భరధ్వాజ తీవ్ర స్థాయిలో స్పందించారు.  దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సినిమాపరమైన అంశాలు, సామాజిక రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు.
Image result for actress hariteja crying
ఇటీవల జరుగుతున్న ఘటనలపై ఆయన తనదైన శైలిలో విశ్లేషణలు అందిస్తున్నారు. టీవల సినీనటి హరితేజ మహానటి చిత్రానికి థియేటర్ కు వెళ్లిన సందర్భంగా ఆమె కుటుంబం ఓ మహిళ నుంచి అవమానం ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ విషయాన్నీ హరితేజ కన్నీరు పెట్టుకుంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం, హాట్ టాపిక్ గా మారడం జరిగిన సంగతి తెలిసిందే.  తన కుమార్తె పక్కన హరితేజ తండ్రి కూర్చోరాదని వాదించిన ఓ ప్రేక్షకురాలు, మీ నాన్న పక్కన కూర్చోడానికి తన కుమార్తె ఇబ్బంది పడుతోందని, మగాళ్ల పక్కన కూర్చోడానికి తామేమీ సినిమా వాళ్లం కాదని గట్టిగానే చెప్పింది.
అందరిలాగే సినిమావాళ్లు
ఈ మాటలతో హర్ట్ అయిన హరితేజ, తాను ఎదుర్కొన్న ఘటనపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.సదరు ప్రేక్షకురాలేమైనా పతివ్రత అన్న సర్టిఫికెట్ తో థియేటర్ కు వచ్చిందా? అని ప్రశ్నించారు. బస్సులో, రైల్లో, విమానాల్లో ప్రయాణించే సమయంలో మీరు మంచి వారేనా అని అడిగి కూర్చుంటారా. ఆ సంధర్భంలో మీ పక్కన కూర్చున్న వారంతా మంచి వారే అని గ్యారెంటీ ఇవ్వగలరా. అసలు ముందు మీరెలాంటి వారు అని మేము అడిగామా అంటూ ప్రశ్నలు సంధించారు.
హరితేజకు ఎదురైన అవమానం
తన మాటలు బాధపెడితే క్షమించాలని అంటూనే, సినిమావాళ్లను చిన్న చూపుచూడవద్దని, వారూ మామూలు మనుషులేనని, తాము ప్రేక్షకులను దేవుళ్లుగా చూస్తామని చెప్పుకొచ్చారు. మాజంలో చెడ్డవారు ఉన్నట్లే సినిమా ఇండస్ట్రీలో కూడా కొంత మంది చెడ్డవారు ఉండే అవకాశం ఉందని అన్నారు. అంత మాత్రానికే అవమానంగా మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: