అక్టోబర్ లో దసరా పండుగకు విడుదల అవుతున్న ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాల మధ్య పోటీ ని పవన్ – జూనియర్ ల మధ్య పోటీ గా కాకుండా త్రివిక్రమ్ – హరీష్ శంకర్ ల మధ్య జరగబోతున్న పోటీగా మీడియా చూస్తూ వార్తలు రాస్తోంది. మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన పవన్ తన పంచ్ డైలాగ్స్ తో మాయ చేసి తన సినిమాలను హిట్ చేసుకోవడంలో సిద్ధహస్తుడు.

అయితే గబ్బర్ సింగ్ ఇచ్చిన హిట్ తో మాస్ డైరెక్టర్ ఇమేజ్ పొందిన హరీష్ శంకర్ ‘రామయ్య వస్తావయ్యా’ లో జూనియర్ ను క్లాస్ లుక్ లో చూపెడుతూ, అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులకు దగ్గర అవడానికి చాలా తీవ్రంగా కృషి చేశాడు అని ఈ సినిమా రషష్ చూసినవారు అంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ స్టార్ డైరెక్టర్స్ సినిమాలు ఒకదానిపై ఒకటి పోటీ పడడం చూసి త్రివిక్రమ్ చాలా షాక్ కు గురి అయ్యాడు అని మాటలు వినిపిస్తున్నాయి. దీనితో ఎందుకైనా మంచిదని హరీష్ కు చెక్ పెట్టె పనిలో బాగంగానే అత్తారింటికి దారేది సినిమాలోని కొన్ని లేటెస్ట్ పవన్ డైలాగ్స్ త్రివిక్రమ్ కావాలని వ్యూహాత్మకంగా లీక్ చేయి౦చాడని, ఈ లీక్ ల ద్వారా తన అత్తారింటికి దారేది సినిమాకు హైక్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్ర విభజన కు సబంధించి క్యాబినెట్ నోట్ కూడా తయారు అయిపోయింది అని సాక్షాత్తూ మన కేంద్ర హోం మంత్రి ప్రకటించడం తో అక్టోబర్ నుండి ఈ సమైఖ్య ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది అన్న సంకేతాలు అందుతున్న నేపధ్యంలో ఈ రెండు సినిమాలు కూడా మరోసారి వాయిదా పడడం ఖాయం అంటూ టాలీవుడ్ లోని కొన్ని వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా ఇద్దరు టాప్ హీరోల మధ్య పోటీ రంగం మార్చుకొని ఇద్దరు టాప్ డైరెక్టర్స్ పోరుగా మారింది అంటూ ఫిల్మ్ నగర్ లో సెటైర్లు పడుతున్నాయి అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: