ప్రిన్స్ మ‌హేష్‌బాబు తాజా చిత్రం మ‌హ‌ర్షి లాంగ్ వీకెండ్‌ను టార్గెట్‌గా పెట్టుకుని బాక్సాఫీస్ దండ‌యాత్ర‌కు రెడీ అవుతోంది. మహ‌ర్షి మీద ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సంక్రాంతి త‌ర్వాత తెలుగులో స్టార్ హీరోల సినిమాలు ఏవీ రాలేదు. దీనికి తోడు మ‌హేష్‌బాబు సినిమా భ‌ర‌త్ అనే నేను వ‌చ్చి యేడాది దాటుతోంది. దీంతో ఇవ‌న్నీ మ‌హ‌ర్షి మీద అంచ‌నాలు పెంచేశాయి. ఆడియో చూసి డిజప్పాయింట్ అయిన ప్రేక్ష‌కుల‌కు ట్రైల‌ర్ ఊపిరిలూదింది. 


ఇక టాలీవుడ్‌లో నాన్ బాహుబ‌లి లెక్క‌ల‌న్ని ఖైదీ నెంబ‌ర్ 150, రంగ‌స్థ‌లం ఖాతాలో ఉన్నాయ్‌. వాటిని మ‌హ‌ర్షి దాటాల‌న్న ల‌క్ష్యంతోనే ఆ సినిమా యూనిట్ ఉంది. గ‌తేడాది భ‌ర‌త్ అనే నేను ఈ రికార్డుల‌ను దాటుతుంద‌ని అనిపించినా ఆరంభం శూర‌త్వంగానే మిగిలిపోయింది. తొలి మూడు వారాల త‌ర్వాత భ‌ర‌త్ పూర్తిగా తేలిపోయింది. కొన్ని ఏరియాల్లో ఆ సినిమాకు న‌ష్టాలూ త‌ప్ప‌లేదు.


ఇక ఇప్పుడు మ‌హ‌ర్షి అలా కాకుండా దూసుకెళ్లేలా ప్లానింగ్ జ‌రుగుతోంది. సోలో రిలీజ్ కావ‌డం... ఈ సినిమాకు పోటీగా మార్కెట్‌లో పెద్ద సినిమాలు కూడా లేక‌పోవ‌డం క‌లిసి రానుంది. అన్ని ఓకే ఎటు తిరిగి సినిమాకు హిట్ టాక్ రావ‌డం ఒక్కటే కావాలి. ఓపెనింగ్స్ విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు లేక‌పోయినా ఆ త‌ర్వాత ఎన్ని రోజులు హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతుంద‌న్న‌ది ఒక్క‌టే చిన్న సందేహం. 


రూ.100 కోట్ల షేర్ దాటితోనే మ‌హ‌ర్షి సినిమాతో మ‌హేష్ స్టామినా ఏంటో తెలుస్తుంది. లేక‌పోతే మ‌ళ్లీ మ‌హేష్ మార్కెట్‌పై చాలా అనుమానాలు ముసురుకుంటాయ్‌. కాంపిటేష‌న్ సినిమాలు లేక‌పోవ‌డం.. ఇప్ప‌టికే అవెంజెర్స్ దూకుడు త‌గ్గిపోవ‌డం ఆ సినిమాకు ప్ల‌స్ అయినా.. కంటెంట్లో దమ్ము ఉండి... క‌నీసం అభిమానుల‌ను అయినా రెండోసారి థియేట‌ర్ల‌కు రప్పిస్తేనే మ‌హ‌ర్షి ఏ సినిమా రికార్డులు అయినా బ‌ద్ద‌లు కొట్టే ఛాన్స్ ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: