సాధారణంగా డాక్టర్లు ఎంతోమంది పేషెంట్లు చూస్తూ ఉంటారు. ఒక్కో పేషెంట్ ఒక సమస్యతో వస్తూ ఉంటారు. దీంతో ఇక ఏ పేషెంట్ను చూసినా కూడా డాక్టర్ కు అంతగా ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే అన్ని రకాల సమస్యలను దాదాపుగా డాక్టర్లు చూసే ఉంటారు. కానీ ఇలా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లను సైతం ఆశ్చర్యపరిచే విధంగా కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇలా జరిగే అరుదైన ఘటనలు డాక్టర్లను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. సాధారణంగా గుండెపోటు వచ్చిన వారికి ఎలాంటి చికిత్స చేయాలి అన్నది డాక్టర్లకు తెలిసే ఉంటుంది.


 ఇక కొన్ని కొన్నిసార్లు గుండెపోటు వచ్చిన సమయంలో బైపాస్ సర్జరీ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు డాక్టరు. ఈ క్రమంలోనే గుండె బద్ద సర్జరీ   చేస్తూ ఉంటారు. ఇక్కడ డాక్టర్లు ఇదే చేయడానికి ప్రయత్నించారు. కానీ సదరు మహిళకు మాత్రం గుండె కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేంటి గుండె లేకుండా మనిషి బ్రతుకుతాడా.. అదెలా సాధ్యం అవుతుంది అని ఆశ్చర్య పోతున్నారు కదా. అయితే అందరిలాగా సదరు మహిళకు గుండె ఎడమ వైపు కాదు కుడి వైపు ఉంది. దీంతో డాక్టర్లు ఇది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామానికి చెందిన రాణెమ్మ అనే 56 ఏళ్ల మహిళకు ఇటీవలే గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. ఈ క్రమంలోనే సదరు మహిళకు బైపాస్ సర్జరీ చేయాలని భావించారు వైద్యులు. ఇక సర్జరీ కూడా ప్రారంభించారు. కానీ గుండె ఎడమ వైపు లేకపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.  గుండె కుడి వైపున ఉంది. దీంతో ఇది గమనించిన వైద్యులు చికిత్స అందించారు. ఇలాంటి సమస్య 12 వేల మందిలో ఒకరికి వస్తుందని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.  బైపాస్ సర్జరీ తర్వాత సదరు మహిళ ఆరోగ్యం నిలకడ గానే ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: