గత కొన్ని రోజుల నుంచి భారత ఆర్మీ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది అని చెప్పాలి. ఉగ్రవాదుల ఆటలు ఎక్కడ సాగనివ్వలేదు. ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేస్తూ ఎప్పటికప్పుడు మట్టు పెడుతూనే ఉన్నారు.. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించిన నివేదికలో సంచలన విషయం బయటపడింది.  కరుడుగట్టిన ఉగ్రవాది సంస్థ ఐఎస్ఐఎస్ లో కూడా భారత సంతతికి చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు ఇటీవలే అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.


 దాదాపు 66 మంది భారత సంతతికి చెందిన ఉగ్రవాదులు ఐ ఎస్ ఐ ఎస్  ఉగ్రవాద సంస్థలో ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఉగ్రవాదంపై పోరులో భారత్ మాత్రం ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది అంటూ ప్రశంసలు కురిపించింది. అయితే ఏడాది నవంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉందో అనే విషయాన్ని ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికలో వివరించింది. ఇక ఈ నివేదిక ప్రకారం గగనతల ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2309 నీ అగ్రరాజ్యమైన అమెరికా తో కలిసి భారత్ ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తోంది అంటూ అమెరికా విదేశాంగ శాఖ హర్షం వ్యక్తం చేసింది.


 విమానాశ్రయాల్లో ఎక్స్రే ద్వారా కార్గో స్క్రీనింగ్ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. అమెరికా భారతదేశాలు ఎంతో వ్యూహాత్మకమైన భాగస్వామ్యం నెలకొల్పి ఉగ్రవాదం అనే రక్కసి పై పోరాటం సాగిస్తు న్నాయి అంటూ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా కూడా ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టడం లో జాతీయ దర్యాప్తు సంస్థ, భారత ఉగ్ర నిరోధక బలగాలు కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని అంటూ చెప్పుకొచ్చింది. అయితే తమ భూభాగం నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రవాదులను  నాశనం చేస్తానని 2015లో పాకిస్తాన్ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో పాకిస్తాన్ కేవలం పరిమితంగా మాత్రమే పురోగతి సాధించింది అంటూ అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించిన నివేదికలో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: