ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.  ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కూడా వస్తుంది. దీనికంతటికీ కారణం రోడ్డు నిబంధనలు పాటించక పోవడమే. ముఖ్యంగా ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం కారణంగా చివరికి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికే ఎన్నోసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయ్. ఈ క్రమంలోనే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరమంటూ తెలిపారు.


 కానీ ఇప్పుడు మాత్రం రోడ్డు నిబంధనల్లో మార్పులు చేర్పులు చేస్తూ సరికొత్త రోల్ ని తెరమీదికి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. నిన్నటి వరకు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన వారి దగ్గర నుంచి భారీగా జరిమానాలు వసూలు చేసిన ట్రాఫిక్ పోలీసులు ఇక ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన కొత్త రూల్ తో ఎవరైనా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన చూసీచూడనట్లు గానే వ్యవహరిస్తారు. ఎందుకంటే మొబైల్ మాట్లాడుతూ కార్ డ్రైవింగ్ చేయడం నేరం కాదు అంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


 ఇక ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. అయితే ఫోన్ మాట్లాడుతున్న సమయం లో కొన్ని రూల్స్ పాటించాలి అంటూ సూచించారు. బ్లూటూత్ లేదా ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తూ ఫోన్ మాట్లాడాలని ఫోన్ కార్ లో పెట్టకుండా డ్రైవర్ జోబులో పెట్టు కోవాలి అంటూ నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు  ఇక ఎవరైనా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే పోలీసులు జరిమానాలు వేయకూడదు అంటూ తెలిపారు. ఎవరైనా జరిమానా వేస్తే కోర్టు లో సవాలు చేయవచ్చు అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 

అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పై ఎంతో మంది పెదవి విరుస్తున్నారు. ఇక కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంతోమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని.. తద్వారా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయే అవకాశం కూడా ఉందని అంటున్నారు మీరేమనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: