
ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ తమ కస్టమర్ల కోసం సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.ఇప్పటికే వున్న పథకాలు జనాలకు మంచి లబ్దిని అందిస్తున్నాయి.తాజాగా సీనియర్లకు గుడ్ న్యూస్ ను చెప్పింది..వారికోసం సరికొత్త ఫ్లాన్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.ఆ స్కీమ్ గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము...
సొంతిల్లు ఉన్న సీనియర్ సిటిజన్‌ల కోసం ఎస్బీఐ ఓ స్కీమ్‌ను లాంచ్ చేసింది. మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎస్బీఐ ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్‌ను లాంచ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్లకు సాయపడేలా రివర్స్ మోర్టగేజ్ లోన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లు రూ.కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. ఆ మొత్తాన్ని టెన్యూర్ పూర్తయ్యే వరకు తిరిగి కట్టకపోయినా ఫర్వాలేదు. అదెలాగా.. స్కీమ్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండకూడదని భావిస్తారు. ముందునుంచే ప్లాన్ చేసుకుని డబ్బు సేవ్ చేస్తారు. వృద్ధాప్యంలో ఆరోగ్య ఖర్చులు, అవసరాలకు డబ్బు అందుబాటులో ఉండేలా చూసుకుంటారు. ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేని, పిల్లలని డబ్బు అడిగి తీసుకోవడం ఇష్టం లేని వారి కోసం ఎస్బీఐ ఓ స్కీమ్‌ను లాంచ్ చేసింది. అలాంటి వృద్ధులకు సొంత ఇల్లు ఉంటే ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఎస్బీఐలో ఆ ఇంటిని తనఖా పెట్టుకోవచ్చు. ఆ ఇంటి విలువను లెక్కగట్టి బ్యాంకు ఎంత మొత్తాన్ని రుణంగా లభిస్తుందో చెబుతుంది. జీవిత మొత్తంలో ఈ లోన్ డబ్బును బ్యాంకుకు కట్టాలనే ఒత్తిడి ఉండదు. ఉదాహరణకు లోన్ టెన్యూర్ 15 ఏళ్లుగా ఉంటే.. అప్పటి వరకు బ్యాంక్ డబ్బు చెల్లించమని కోరదు.
ఈలోగా సంబంధిత వ్యక్తులు మరణిస్తే బ్యాంకు ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది.అతని వారసులు వడ్డీని కట్టి ఇంటిని సొంతం చేసుకొవచ్చు..ఇందులో ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు అర్హులు. భార్యాభర్తలు ఇద్దరి పేరు మీదా రుణం తీసుకోవాలంటే భార్య వయసు 58 దాటాలి. వయసు ఆధారంగా లోన్ టెన్యూర్ పది నుంచి పదిహేను సంవత్సరాలు ఉంటుంది. రూ.మూడు లక్షల నుంచి రూ.కోటి వరకు రుణం పొందవచ్చు..
దరఖాస్తుదారునికి ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్‌లకు సంబంధించిన 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు అందజేయాలి. ఇంతకు ముందు నుంచి ఏమైనా బ్యాంకు లోన్‌లు నడుస్తుంటే గత ఏడాదికి సంబంధించిన లోన్ అకౌంట్ స్టేట్‌మెంట్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ఉద్యోగులైతే ఇన్‌కం ప్రూఫ్ ఉండాలి. గత రెండేళ్ల ఐటీ రిటర్న్‌లకు సంబంధించిన ఫామ్-16 కాపీలు, అక్నాలడ్జ్‌మెంట్‌లు అవసరమవుతాయి. నాన్ శాలరైజ్ట్ దరఖాస్తుదారులు బిజినెస్ అడ్రస్ ప్రూఫ్, గత మూడేళ్ల ఐటీ రిటర్న్‌లు, బ్యాలెన్స్ షీట్‌లు, ప్రాఫిట్ అండ్ లాస్ ఎకౌంట్ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. బిజినెస్ లైసెన్స్ వివరాలు, టీడీఎస్ సర్టిఫికెట్, సీఏ నుంచి సర్టిఫికెట్ ఆఫ్ క్వాలిఫికేషన్‌ని పొందాల్సి ఉంటుంది.
మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను అంటించి లోన్ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. ఎంప్లాయ్ ఐడెంటిటీ కార్డు తప్పని సరిగా అందజేయాలి. పాన్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డులలో ఏదో ఒక దానిని ఐడీ ప్రూఫ్‌గా సమర్పించాలి. అడ్రస్ ప్రూఫ్ కింద టెలిఫోన్ బిల్, కరెంటు బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్, ఆధార్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్‌లలో ఏదొక ఒకదానిని అందించాలి..