ఇటీవల కాలంలో టెక్నాలజీ కొత్త పొంతలు తొక్కుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక అన్ని రంగాల్లో కూడా అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది అని చెప్పాలి. అటు వైద్యరంగంలో కూడా రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతూ ఉండడం.. విప్లవాత్మకమైన మార్కులకు కారణం అవుతుంది అని చెప్పాలి. ఒకప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుతం ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా అధునాతన టెక్నాలజీతో కూడిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయి అని చెప్పాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం ఇక ఇలాంటి సదుపాయాలను నేటి రోజుల్లో పొందగలుగుతున్నారు జనాలు. ఈ క్రమంలోనే కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని అటు వైద్యులు కూడా వైద్య రంగంలో సరికొత్త మిరాకిల్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తూ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి ఒక అరుదైన సర్జరీ చేసిన వైద్యులు చివరికి విజయవంతమయ్యారు. ఏకంగా తెగిపడిన మర్మాంగాన్ని ప్రత్యేక చికిత్స ద్వారా తిరిగి అతికించగలిగారు వైద్యులు. ఈ ఘటన బెంగళూరులోని ఫోర్టీస్ ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నైజీరియాలో ఆరు నెలల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 12 సంవత్సరాల బాలుడి మర్మాంగం పూర్తిగా తెగిపడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఇక శస్త్ర చికిత్స చేసారు వైద్యులు.



 ఈ క్రమంలోనే రెండు దశల శస్త్ర చికిత్స అనంతరం ఇక మూత్ర విసర్జనకు ఎలాంటి సమస్య లేకుండా అటు మర్మాంగాన్ని మళ్లీ తిరిగి అతికించారు అని చెప్పాలి. ఇక మూడవ దశలో భాగంగా సదరు బాలుడికి మూత్ర నాళాలను  ఏర్పాటు చేశారట. తర్వాత ఆరు నెలలకు  బాలుడికి మరో శాస్త్ర చికిత్స చేస్తామని చెప్పుకొచ్చారు వైద్యులు. అయితే బాలుడు పెరిగి పెద్దయిన తర్వాత వైవాహిక జీవితం గడిపేందుకు కూడా ఎలాంటి సమస్య ఉండకుండా ఇక శస్త్ర చికిత్స చేస్తున్నట్లు వైద్యులు చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: