జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొందరలో డబల్ యాక్షన్ చేయబోతున్నారు. అదికూడా తెలంగాణా, ఏపీ ఎన్నికల్లో ఒకే పాయింట్ ఆధారంగా. తెలంగాణాలో కేసీయార్ కు అనుకలంగా, ఏపీలో చంద్రబాబుకు మద్దతుగా డబల్ యాక్షన్ చేయబోతున్నారు.  తెలంగాణా ఎన్నికల్లో  జనసేన 14 పార్లమెంటు స్ధానాల్లో పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. ఏపీలోనే పార్టీకి దిక్కులేదంటే తెలంగాణా ఎన్నికల్లో ఎలా పోటీచేయబోతున్నారు ? అన్నదే అసలు పాయింట్.  



 


ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే అధికారపార్టీకి అడ్వాంటేజ్ అన్న విషయం తెలిసిందే. ఇందుకనే ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని చాలాసార్లు శపథాలు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువస్తానని చాలాసార్లు ప్రకటించారు. ఇక తెలంగాణాకు వస్తే ఇప్పటికే ఉన్న ప్రతిపక్షాలకు అదనంగా పవన్ కూడా చేరబోతున్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ కాకుండా ఇప్పటికే చిన్నాచితకా పార్టీలు చాలావున్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లు జనసేన కూడా కలుస్తోంది. అంటే ఏపీలో ప్రతిపక్షాలను ఏకంచేయాలని చూస్తున్న పవన్ తెలంగాణాలో మాత్రం ఎక్కువ ప్రతిపక్షాలు పోటీలో ఉండేట్లుగా చూస్తున్నారు.





అంటే తెలంగాణాలో కేసీయార్ కు అనుకూలంగా, ఏపీలో చంద్రబాబుకు మద్దతుగా అన్నమాట. ఏపీలో ఒకలాగ తెలంగాణాలో మరోలాగ వ్యవహరిస్తున్నారంటే పవన్ డబల్ యాక్షన్ చేస్తున్నట్లే కదా. తెలంగాణాలో షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలు రాబోయే డిసెంబర్లో జరగాల్సుంటే ఆ తర్వాత నాలుగు నెలలకు ఏపీలో ఎన్నికలు జరుగుతాయి.  అంతా బాగానే ఉందికానీ డబల్ యాక్షన్ చేయటానికి సరిపడా కెపాసిటి పవన్ కుందా అన్నదే అందరి అనుమానం.





ఏపీలోనే ఇప్పటికీ పార్టీ నిర్మాణం జరగలేదు. 175 అసెంబ్లీ+25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేయాలంటే గట్టి అభ్యర్ధులే లేరు. అలాంటిది ఉనికేలేని తెలంగాణాలో 7-14 పార్లమెంటు స్ధానాల్లో పోటీచేస్తానని పవన్ ఎలా ప్రకటించారు ? ఇక్కడే అర్ధమైపోతోంది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చటమే అసలు ఉద్దేశ్యమని. తెలంగాణాలో అభ్యర్ధులే కాదు అసలు ఓటర్లున్నారా అన్నదీ అనుమానమే.  మరి పవన్ డబల్ యాక్షన్ను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: