డేటా చోరీ కేసును చంద్రబాబునాయుడు సక్సెస్ ఫుల్ గా తప్పుదారి పట్టిస్తున్నారు. ఏపిలోని 3.5 కోట్లమంది జనాల వ్యక్తిగత వివరాలను ఐటి గ్రిడ్ సాఫ్ట్ వేర్ సంస్ధ దొరికింది. అందుకు చంద్రబాబు లేకపోతే ఐటిశాఖ మంత్రి నారా లోకేషే బాధ్యత వహించాలి. గుట్టు చప్పుడు కాకుండా దాదాపు ఏడాదిన్నరకు పైగా డేటాను పై సంస్ధ ఉపయోగించుకుంటోంది. ఎప్పుడైతే విషయం వెలుగు చూసిందో వెంటనే చంద్రబాబు ఎదురుదాడి మొదలుపెట్టారు. కేసు తమపైకి రాకుండా పోలీసులను అడ్డం పెట్టుకుంటున్నారు.

 

ఐటి గ్రిడ్ సాఫ్ట్ వేర్ కంపెనీ  డేటా స్కాం చోరీకి సంబంధించిన కేసులో ఏపి పోలీసులపై తెలంగాణాలో కేసు నమోదు చేయనున్నట్లు కమీషనర్ ఆఫ్ పోలీసు సజ్జనార్ తెలిసారు. మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణా పరిధిలో నమోదైన ఫిర్యాదుపై తాము విచారణ జరుపుతుంటే ఏపి పోలీసులు అడ్డుపడుతున్నట్లు సజ్జనార్ మండిపడ్డారు. ఏపి పోలీసులు అనవసరంగా తమ  దర్యాప్తులో వేలు పెడుతున్నట్లు సిపి అభిప్రాయపడ్డారు. డేటా చోరీకి సంబంధించి ఫిర్యాదు చేసిన లోకేశ్వరెడ్డి ఇంటికి వెళ్ళి ఏపి పోలీసులు బెదిరించటం దారుణమన్నారు.

 

మొత్తానికి చంద్రబాబు తాను అనుకున్నట్లే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజంగా కేసు గనుక దర్యాప్తు జరిగితే తనతో పాటు కొడుకు, ఐటి మంత్రి నారా లోకేష్ కూడా ఇబ్బందులు పడతామని చంద్రబాబుకు అర్ధమైపోయింది. దాంతో ముందుజాగ్రత్తగా ఏపి పోలీసులను ఉసిగొల్పారు. నిజానికి తెలంగాణా భూభాగంలో ఏపి పోలీసులకు ఏమీ సంబంధం లేదు. అయినా కేసులో వేలు పెట్టి తెలంగాణా పోలీసులను చికాకు పెడుతున్నారు. అంటే అసలు విషయం మరుగునపడి కొసరు విషయాన్ని తెరపైకి తేవటమన్నది చంద్రబాబుకు మామూలే.


మరింత సమాచారం తెలుసుకోండి: