ద హిందూ.. దేశంలో ఇప్పటికీ కాస్తో కూస్తో విశ్వసనీయత ఉన్న పత్రిక.. ఏపీ సీఎం అడ్డగోలు నిర్వాహకం గురించి ద హిందూ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ను చంద్రబాబు తన స్వార్థం కోసం అడ్డగోలుగా అప్పుల్లోకి నెట్టేసిన తీరును కళ్లకు కట్టింది. 


రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అవగాహన ఉన్నా.. ఒక్క ఏప్రిల్ నెల మొదటి వారంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు సేకరించిందట. దానిని పసుపు-కుంకుమ స్కీమ్ కింద, అన్నదాత సుఖీభవ వంటి స్కీములకు ఖర్చు చేశారని చెబుతున్నారు. ఆ పథకాలు హడావిడిగా ఎందుకు ప్రారంభించారో అందరికీ తెలిసిందే. 

ఓట్ల కోసం జనం డబ్బును ఖర్చు చేయడం వల్ల ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ ఆర్దిక పరిస్థితి సంక్షోభంలోకి వెళ్లిందని ఆ పత్రిక కథనం సారాంశం. అప్పు చేయనిదే ఏ పని చేయడానికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తుండడం, ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లడం వల్ల ఏపీ పరిస్థితి మరీ దిగజారింది. 

ఇప్పటికే ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ పలుమార్లు హెచ్చరించిందట కూడా. అయినా లెక్కచేయకుండా చంద్రబాబు రాజకీయ లబ్దితోనే హడావిడిగా భారీ ఖర్చుతో కూడిన పసుపు కుంకమ, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. అప్పు పుట్టకపోతే ఏప్రిల్ నెల జీతాలను ఉద్యోగులకు చెల్లించడం కూడా కష్టమేనట. 



మరింత సమాచారం తెలుసుకోండి: