బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం.. ఎందుకు ఇష్టం అనేది చెప్పలేం కానీ ఇష్టం అని మాత్రం చెప్పగలం. అందుకే బంగారం ధరలు పెరిగియంటే భాద పడుతుంటారు. పండుగ వచ్చిన పిల్లల బర్త్డే అయినా లేదా పెళ్లి అయినా సరే ఆ సందర్భాల్లో బంగారం కొనుగోలు చెయ్యాలని చాలామంది అనుకుంటారు.         

 

అయితే ఆలా కొన్న బంగారాన్ని ఇంట్లో పెట్టుకోలేం ఎందుకంటే దొంగలు పడుతారు ఏమో అనే భయం.. అందుకే ఆ బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెడుతుంటారు. ఇంట్లో కంటే బ్యాంకులోనే బంగారం సేఫ్ అని అనుకుంటుంటాం.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాంకు లాకర్‌లోని వస్తువులకు బాధ్యత తీసుకోదు.       

 

అందుకే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు బ్యాంక్ లాకర్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తున్నాయి. ఈ ఇన్సూరెన్స్ పాలసీ సేవలతో బంగారం ఎక్కడ ఉన్న సరే ఈ పాలసీలు వర్తింప చేస్తాయి. అగ్ని ప్రమాదం, భూకంపాలు, దొంగతనం వంటి సందర్భాల్లో లాకర్‌లోని నగలు లేదా ఇతర విలువైన వస్తువులు పోతే అప్పుడు పాలసీ కవరేజ్ లభిస్తుంది.     

 

అయితే ఈ బ్యాంక్ లాకర్ ఇన్సూరెన్స్ సేవలు అతితక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్ ప్రకారం రూ.3 లక్షల కవరేజ్ తీసుకుంటే రూ.300 ప్రీమియం చెల్లించాలి. ఇక గరిష్టంగా రూ.40 లక్షల వరకు కవరేజ్ వర్తిస్తుంది అయితే ఈ 40లక్షల కవరేజికి రూ.2,500 ప్రీమియం చెల్లించాలి. బంగారం మనం ఎంత ఇష్టంగా తీసుకుంటామొ.. అది అంతావిలువైనది. మనం తీసుకున్న బంగారంలో ముక్కురాయి పోయినా బాధగానే ఉంటుంది. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కదిద్దుకోవాలి అని అంటుంటారు పెద్దలు. అందుకే బంగారం పోగొట్టుకోకముందే ఈ పాలసీ తీసుకొని జాగ్రత్త పడటం మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: