అందరికీ వార్తలు పంచే మీడియా ఇప్పుడు వార్తల్లోకి ఎక్కుతోంది. ఏదో ఒకసారో, రెండు సార్లో అంటే ఏదైనా జరుగుతుంటుంది. కానీ ..ఇటీవలి కాలంలో మీడియా తరచూ వార్తల్లోకి వస్తోంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి బాగా పెరిగింది. ఇక అందులోనూ ఏపీ విషయానికి వస్తే..ఇది మరో ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈవిషయం చర్చనీయాంశమైంది.

 

ఏపీ సర్కారు కూడా మీడియా పట్ల కఠిన వైఖరి అవలంభిస్తోంది. మీడియాలో ఇష్టానుసారం కథనాలు రాస్తే.. అవసరమైతే ఆయా పత్రికలపై కేసులు పెట్టే అవకాశం అధికారులకు ఇస్తూ ఆ మధ్య జగన్ సర్కారు విడుదల చేసిన జీవో చర్చనీయాంశమైంది. ఈ జీవో విడుదలయ్యాక కొన్ని పత్రికలు పత్రికా స్వేచ్ఛపై దాడిగా వర్ణిస్తూ గగ్గోలు పెట్టాయి. తాము కథనాలు రాయడమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న మీడియా ప్రముఖులతో కథనాలు ఇప్పించాయి.

 

ఇన్ని నీతులు చెప్పే అవే పత్రికలు.. రోజురోజుకూ దిగజారి వ్యవహరిస్తున్నాయి. దురుద్దేశపూర్వకంగా కథనాలు ఇస్తున్నాయి. తెలిసీ ప్రభుత్వంతో చెలగాటం ఆడుతున్నాయి. అటు మీడియా రాతలు.. వాటిని ఖండిస్తూ మంత్రులు ప్రకటనలు నిత్య కృత్యం అయ్యాయి. గతంలో ఎప్పుడో ఓసారి తప్ప మీడియా గురించి మంత్రులు నేరుగా మాట్లాడేవారు కాదు.

 

కానీ ఇప్పుడు ఉదయం పత్రికల అత్యుత్సాహం. ఆ తర్వాత సాయంత్రం మంత్రుల ఖండల ప్రకటనలు సర్వసాధారణం అయ్యాయి. గతంలో పత్రికలపై మాట్లాడేందుకు మంత్రులు కూడా జంకేవారు.. ఏదైనా తప్పనిసరి అయితే తప్ప విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు పత్రికలను విమర్శించడం కూడా రొటీన్ అయ్యింది. మరి ఈ ధోరణి ఎన్నాళ్లు సాగుతుందో..ఏమో.. ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: