చంద్రబాబు పీఎస్ శ్రీనివాస చౌదరి రూ. 2000 కోట్ల స్కామ్ లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సోదాల్లో తక్కువ డబ్బు, నగలు దొరికినా.. 2000 కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించిన ఆధారాలు దొరికినట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. ఈ స్కామ్ లో కొన్ని కంపెనీలకు భాగస్వామ్యం ఉందని ఆ ప్రకటన తెలిపింది.

 

అయితే ఆ కంపెనీలు, వ్యక్తులు ఎవరన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయంలో వైసీపీ నాయకులు ఆ వివరాలు ఇవిగో అంటూ బయటపెడుతున్నారు. వైసీపీ మంత్రి ఒకరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి ఏమన్నారంటే.. " పర్సనల్‌ సెక్రటరీని ఎంక్వైరీ చేస్తే రూ. 2 వేల కోట్ల దోపిడీ జరిగిందని, మూడు కంపెనీలు ఆర్కే ఇన్‌ఫ్రా, అవెక్సా ఇన్‌ఫ్రా, డీఎన్‌సీ ఇన్‌ఫ్రా అని పెట్టారని వైసీపీ మంత్రి చెప్పారు.

 

 

ఆర్కే ఇన్‌ఫ్రా ప్రమోటర్‌గా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, అవెక్సా ఇన్‌ఫ్రా ప్రమోటర్‌గా ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్, ఇంకో కంపెనీ ప్రమోటర్‌ ఈ రోజు వెల్లడవుతుంది. లోకేష్‌ బినామీ కిలారి రాజేష్‌ ఈ కుంభకోణాల్లో ఒక కంపెనీకి డైరెక్టర్‌ ఇది జరిగే వ్యవహారం.. అంటూ వివరించారు సదరు మంత్రి.

 

 

ఈ వ్యవహారం వెలుగు చూడకుండా ఎంపీలను పంపించి మ్యానేజ్‌ చేయాలని అనుకున్నాడని సదరు మంత్రి ఆరోపించారు. ఆఖరికి పవన్‌ కల్యాణ్‌ను పంపించి బీజేపీతో జతకట్టించాలని చూశాడట చంద్రబాబు. అప్పటికే ఎంక్వైరీ ఒక అడుగు ముందుకుపడి ఉంటుందని మంత్రి తెలిపారు. ఐటీ దాడులను ఆపేందుకు చంద్రబాబు చాలా ట్రై చేశాడన్నారు. తండ్రీకొడుకులిద్దరూ ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబు అవినీతి గురించి చెబుతున్నారని గుర్తుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: