చంద్రబాబు పాలనలోని అక్రమాలపై విచారణ జరపాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం నియమించింది. అది రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా ఇప్పుడు ప్రత్యేకంగా విచారణ కోసం సిట్ వేసింది జగన్ సర్కారు. ఓవైపు ఈ వ్యవహారం చంద్రబాబు గుండెళ్లో దడ పుట్టిస్తుంటే.. మరోవైపు ఈఎస్ఐ స్కామ్ తరముకుంటూ వస్తోంది.

 

ఈ ఈఎస్ ఐ స్కామ్ లో ప్రముఖంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు వినిపించింది. అయితే ఇప్పటి వరకూ చంద్రబాబు పై విచారణ కోసం వైసీపీ డిమాండ్ చేస్తుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా తయారైంది. పార్టీ నేతలు కూడా చంద్రబాబు అక్రమాలపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ డిమాండ్‌ చేశారు.

 

అచ్చెన్నాయుడు అవినీతిలో కూరుకుపోయాడు కాబట్టే మోదీ పేరు ప్రస్తావిస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అవినీతి బురద బీజేపీకి అంటించాలని చూస్తున్నారని

బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ మండిపడ్డారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపైనా విచారణ జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ డిమాండ్ చేస్తున్నారు.

 

టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్న సాయికృష్ణ.. అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు...ఈఎస్‌ఐకి రాసిన లేఖకు పొంతన లేదని అన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా చంద్రబాబు సర్కారు అక్రమాలపై కత్తులు నూరుతుండటంతో టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఎన్నికల ముందు వరకూ బీజేపీపై నిప్పుల వర్షం కురించిన చంద్రబాబు ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు.

 

మోడీతో పెట్టుకుంటే కేసులతో కుమ్మోస్తారన్న భయంతో సైలంట్ గా ఉన్నారు. అంతే కాదు వీలు కుదిరితే బీజేపీతో మళ్లీ దోస్తీ కోసం ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. ఏపీ రాజకీయాల విషయంలో రెండు పార్టీలు ఒకే లైన్ కూడా తీసుకుంటున్నాయి. ఈ సమయంలోఇలా బీజేపీ నేతలు చంద్రబాబు పాలనపై విచారణకు డిమాండ్ చేస్తుండటం టీడీపీ వర్గాల గొంతులో పచ్చివెలక్కాయి పడినట్టైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: