కరోనాను కట్టడి చేయడానికి గాను తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడిక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అన్ని విధాలుగా ఒక ప్రభుత్వ అధినేతగా కెసిఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా ఆయన ప్రజలకు ఇబ్బంది కలిగే చర్యలను తీసుకునే పరిస్థితి కనపడటం లేదు. జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేయకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఆయన ప్రజలను హెచ్చరించడమే కాదు కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో కూడా కెసిఆర్ వివరించారు అందరికి. 

 

వరుస మీడియా సమావేశాలు పెట్టడం, అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించడం, ఏ నిర్ణయం అయినా సరే వేగంగా తీసుకోవడంతో పాటుగా పక్కా వ్యూహంతో కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి కెసిఆర్ సిద్దమయ్యారు. ఈ నెల 31 వరకు తెలంగాణా లో లాక్ డౌన్ ప్రకటించారు. అంతే కాకుండా ప్రజలు అందరికి ఇబ్బంది లేకుండా ఉండటానికి గాను రేషన్ ఇవ్వడంతో పాటు గా కుటుంబానికి 1500 ఇస్తామని ప్రకటించారు ఆయన. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా అదుపులో ఉంది కాబట్టి ఎక్కడా కూడా అలసత్వం వద్దని ప్రజలకు సూచిస్తున్నారు. 

 

ప్రజల్లో స్పూర్తిని నింపడానికి గాను ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు కెసిఆర్. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆయన చప్పట్లు కొట్టడం గమనార్హం. ఇక రేషన్ తో పాటుగా ప్రజలకు ఆర్ధిక సహాయం కోసం నిధులు విడుదల చేసారు. కాన్పు వచ్చే వాళ్ళ విషయంలో కూడా ఆయన జాగ్రత్తగానే నిర్ణయం తీసుకుని అధికారులతో జాబితా సిద్దం చేయిస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా సరే పక్కా ప్లానింగ్ తో ముందుకి వెళ్తున్నారు కెసిఆర్. ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరాన్ని కట్టడి చేసారు తన నిర్ణయాలతో. అంత పెద్ద మహానగరాన్ని కూడా కెసిఆర్ కట్టడి చేసిన తీరు నిజంగా అభినందనీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: