మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూ... ఏపీ సీఎం జగన్ కూ కొన్నాళ్లుగా పరోక్ష యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. చివరకు అది కాస్తా ప్రత్యక్ష యుద్ధంగా మారి.. ఏకంగా జగన్ సర్కారు అరాచకాలు చేస్తోందంటూ కేంద్రానికి నిమ్మగడ్డ లేఖ రాయడం.. ఆ తర్వాత జగన్ ఆర్డినెన్స్ సాయంతో నిమ్మగడ్డను ఆ పదవి నుంచి తొలగించడం కరోనా కాలంలోనూ హాట్ హాట్ రాజకీయాలకు ఆస్కారం కల్పించాయి.

 

 

అయితే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో జగన్ మరీ దూకుడుగా మొండిగా వెళ్లారన్న అభిప్రాయం మొదట్లో జనంలో కలిగింది. కానీ ఇప్పుడు రమేశ్ కుమార్ చేసిన తప్పులు వెలుగు చూస్తున్న కొద్దీ ఆయనపై సానుభూతి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.

ఎందుకంటే.. అసలు నిమ్మగడ రమేష్ కేంద్ర హోమ్ శాఖకు పంపిన లేఖ చూస్తే... రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న వ్యక్తి పంపాల్సిన లేఖలా లేనేలేదు.

 

 

అది ఓ రాజకీయ నాయకుడు రాసిన ఆరోపణల లేఖలా ఉంది. దీనికితోడు ఆ లేఖను బయటి నుంచి తెప్పించుకున్నారు. అలా తెప్పించుకునేందుకు ఉపయోగించిన ల్యాప్‌టాప్‌, డెస్క్ టాప్, పెన్ డ్రైవ్ నుంచి ఆ తర్వాత ఆధారాలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. మరి ఆధారాలు లేకుండా చేయాల్సిన పరిస్థితి రమేష్‌కు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కీలు బొమ్మగా వ్యవహరించారన్న విషయం ప్రస్ఫుటమవుతోందన్న వాదన వినిపిస్తోంది.

 

 

చంద్రబాబు ఎక్కడ సంతకం పెట్టమంటే ఎక్కడ నిమ్మగడ్డ రమేష్ అక్కడ సంతకం పెట్టి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అశోక్ బాబు పంపిన లేఖకు, కేంద్ర హోమ్ శాఖకు పంపిన లేఖకు ఒకే రిపరెన్స్ నెంబర్ ఉండటం మరో తప్పు. దీంతో ఇప్పుడు వైసీపీ సర్కారు ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా తవ్వుతోంది. ఇలా నిమ్మగడ్డ చేసిన తప్పులు జగన్ కు వరంగా మారుతున్నాయి. అసలే జగన్.. ఇలాంటి వారిని ఉపేక్షించే అవకాశమేలేదంటున్నారు ఆయన మనస్తత్వం తెలిసినవారు. ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: