రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన‌ప్ప‌టి నుంచి తొలి ఐదేళ్ల‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ధ్య రెండేళ్ల వ‌ర‌కు సంబంధాలు బాగానే ఉన్నాయి. అక్క‌డ నుంచి ఇద్ద‌రు సీఎంలు... రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య ఉప్పు నిప్పుగా వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇక ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల‌ను వ‌రుస పెట్టి సైకిల్ ఎక్కిం చేసుకున్నారో ఆ త‌ర్వాత ఓటుకు నోటు కేసు బ‌య‌ట‌కు రావ‌డంతో చంద్ర‌బాబు వ‌ర్సెస్ కేసీఆర్ మ‌ధ్య యుద్ధం మామూలుగా జ‌ర‌గ‌లేదు. ఇక కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు చంద్ర‌బాబు కాంగ్రెస్ తో జ‌ట్టు క‌ట్ట‌డం.. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, బాబోరి కూట‌మి చిత్తుగా ఓడిపోవ‌డం జ‌రిగాయి. 

 

ఇక అక్క‌డ కేసీఆర్ గెలుపు కు జ‌గ‌న్‌... ఇక్క‌డ జ‌గ‌న్ గెలుపు.. బాబోరి ఓట‌మికి టీఆర్ఎస్ శ్రేణులు ఎంతైనా ప‌రోక్షంగా ఒక‌రికి ఒక‌రు స‌హ‌క‌రించుకున్నాయి. క‌ట్ చేస్తే ఇక్క‌డ జ‌గ‌న్ సీఎం అయ్యాక యేడాది పాల‌నా కాలం పాటు ఇద్ద‌రు సీఎంల మ‌ధ్య గ్యాప్ రాలేదు. తాజాగా జ‌గ‌న్ కృష్ణా బోర్డు అనుమ‌తి లేకుండానే పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామ‌ర్థ్యం పెంచుకునేందుకు జీవో విడుద‌ల చేయ‌డం అక్క‌డ కేసీఆర్ కు కాక పెట్టేసింది. ఇక ఇద్ద‌రి మ‌ధ్య ప‌రోక్ష యుద్ధం మొద‌ల‌వుతోంద‌నుకుంటు న్న టైంలోనే కేసీఆర్ గ‌త రాత్రి ప్రెస్ మీట్లో మా ఇద్ద‌రి మ‌ధ్య ఏం లేద‌ని చిన్న ఉప‌శ‌మ‌నం క‌లిగించారు.


 
అయితే అంత‌కు ముందే తెలంగాణ ప్ర‌భుత్వం కంప్లైంట్ చేయ‌డంతోనే ఏపీ అధికారులు కృష్ణా రివ‌ర్ బోర్డు చైర్మ‌న్‌, అధికారుల‌కు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అలాగే తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా, గోదావ‌రి న‌దుల‌పై నిర్మించే ప్రాజెక్టుల‌పై సైతం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. అస‌లు విభ‌జ‌న చ‌ట్టాన్నే తెలంగాణ ప్ర‌భుత్వం ఉల్లంఘించి మ‌రీ ప్రాజెక్టులు క‌డుతోంద‌ని కూడా ఆరోపించారు. ఇక కేసీఆర్ కూడా జ‌గ‌న్‌కు చిన్న‌పాటి వార్నింగ్ ఇచ్చిన‌ట్టుగా మాట్లాడిన‌ట్టే క‌నిపిస్తోంది. దీనికి ప్ర‌తిగానే జ‌గ‌న్ కూడా ఏపీ కోసం.... ఇక్క‌డ ప్ర‌జ‌ల కోసం ఎందాకైనా వెళ‌తాన‌న్న‌ట్టుగా సీరియ‌స్‌గా త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ అధికారుల‌తో అటు కంప్లైంట్ చేయించ‌డంతో పాటు ప్రాజెక్టు విష‌యంలో తాను దూకుడుగానే ఉంటాన‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: