భారత దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అన్ లాక్ 1.0 మొదలైనప్పటి నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. నిజానికి దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలలోనే దేశంలోని 50 శాతం పైగా కేసులు నమోదవుతున్నాయి.

 


ఇక మహారాష్ట్ర రాష్ట్రంలో అయితే పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కేసులు ఒక లక్ష యాభై వేలకు చేరువలో ఉన్నాయి. అంతేకాక మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇదిలా ఉండగా మహారాష్ట్ర రాష్ట్రంలో పోలీసులను కరోనా వెంటాడుతోంది. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో ఏకంగా 190 మంది పోలీసులకు కరోనా సోకిందంటే అక్కడ కరోనా ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అందులో ఇద్దరు మరణించారని మహారాష్ట్ర పోలీస్ శాఖ తెలియజేశారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 4716 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అందులో ఏకంగా 56 మంది పోలీసులు వారి ప్రాణాలను వదిలారని పోలీస్ శాఖ తెలిపింది.

 


కరోనా బారిన పడిన పోలీసులలో 3444 మంది పోలీసులు కరోనా నుండి బయటపడ్డారని తెలుస్తోంది. ఇక ఇందులో కూడా ముంబై నగరంలోని పోలీసులకు ఎక్కువగా సోకుతుంది. పోలీసులకు ప్రత్యేకంగా మూడు ప్రాంతాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని పోలీస్ పిఆర్ఓ ప్రణయ్ అశోక్ తెలియజేశారు. ఇక ఈ మూడు కేంద్రాల్లో మొత్తం వెయ్యి పడకల అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే ఇప్పటివరకు కేవలం ముంబై నగరంలోని కరోనా సోకి 37 మంది పోలీసులు మరణించారు. ఇకపోతే రాష్ట్రంలో ఇప్పటివరకు లక్ష 47 వేల పాజిటివ్ కేసులు నమోదవగా అందులో 63257 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 77 వేల మందికి పైగా కరోనా నుండి కోలుకున్నారు. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా 6900 మంది పైగా మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: