దసరా పండుగ హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఒకటి. ఈ పండుగ మన  విజయవాడలో అంగరంగ వైభవంగా జరుపుతారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు ఈరోజు. అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులను కటాక్షిస్తున్నారు. ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయానికి  భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని  దర్శించుకొని తరిస్తున్నారు.  అన్నపూర్ణ దేవి రూపంలో అమ్మ... రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది.

కేవలం ఈ ఒక్క రోజే కాదు. మొత్తం ఈ నవరాత్రులని కూడా ఎంతో బాగా జరుపుతారు. అంటే అక్టోబర్ 17 శనివారం నుండి ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈరోజు అవతారమైన అన్నపూర్ణని ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు తెలిపారు. అలానే దసరా రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి తగిన ఏర్పాట్లు అధికారులు, ఆలయ నిర్వాహకులు చేస్తున్నారు . కరోనా కారణంగా వచ్చే భక్తులు మాస్క్ తప్పక ధరించాలన్నారు.  

ఏడాది నుంచి నిర్మాణంలో ఉన్న శివాలయం కూడా ఇప్పుడు పూర్తయింది. దీనితో  శనివారం నుంచి శివాలయంలో కూడా దర్శనాలకు అనుమతిస్తున్నారు. అలానే దర్శనానికి వెళ్లాలనుకునే వారు ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేసుకుని..... వాళ్ళకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తారు అని తెలిపారు. ఒక వేళ ఆన్‌లైన్ టికెట్ సమస్యలు ఉన్న వాళ్ళకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయి అని తెలిపారు.  వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు వరకే అనుమతి ఉంటుందని ఈవో సురేష్ బాబు చెప్పారు. అలానే వీఐపీలు కూడా ఆన్‌లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: