20 రోజుల క్రితం విజయవాడలో మహేష్ అనే కమీషనర్ ఆఫీస్ ఉద్యోగి హత్య సంచలనం సృష్టించింది. ఈ కేసులో అసలు నిందితులు ఎవరూ అనేది విజయవాడ పోలీసులు పూర్తి స్థాయిలో గాలించినా సరే ఎవరి సమాచారం కూడా దొరకలేదు. ఆ తర్వాత గోవాలో ఇద్దరినీ అక్కడి పోలీసుల ద్వారా అదుపులోకి తీసుకున్న బెజవాడ పోలీసులు అక్కడి నుంచి కూడా  ఈ కేసు మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. తాజాగా ఈ కేసుకి సంబంధించిన విషయాలను బెజవాడ సీపీ బత్తిని శ్రీనివాస్ మీడియాకు పూసగుచ్చినట్టు వివరించారు.

సీపీఓ ఉద్యోగి మహేష్ ని తుపాకీ తో కాల్చి హత్య చేసిన ఘటనలో ముగ్గురు అరెస్ట్ చేసామని ఆయన మీడియాతో తెలిపారు. మద్యం మత్తులో వివాదం జరగడంతో హైదరాబాద్ కి చెందిన సాకేత్ రెడ్డి... మహేష్ పై కాల్పులు జరిపాడని సీపీ ఘటన గురించి చెప్పారు. ఘటన జరిగినపుడు సాకేత్ రెడ్డితో పాటుగా గంగాధర్ అనే వ్యక్తి ఉన్నట్టు తెలిపారు. సాకేత్ రెడ్డికి బెజవాడ ఆటో డ్రైవర్ రాధాకృష్ణ రెడ్డి స్నేహితుడు అని వివరించారు. ఘటన జరిగినప్పుడు రాధాకృష్ణ రెడ్డి ఆటోలోనే సాకేత్, గంగాధర్ ఘటనా స్థలానికి మద్యం తాగటానికి వచ్చాడని ఆయన వివరించారు.

తెనాలికి చెందిన సందీప్ గుంటూరులో ఒకరిని కిడ్నాప్ చేయటంతో పాటుగా, మరొకరికి వార్నింగ్ ఇవ్వటానికి సాకేత్ రెడ్డిని పిలిపించాడని ఆయన తెలిపారు. కిడ్నాప్ చేద్దాం అని వచ్చిన సాకేత్ గ్రూప్ మద్యం మత్తులో మహేష్ గ్రూప్ తో వివాదం జరగడంతో మహేష్ పై సాకేత్ కాల్పులు జరిపారని ఆయన వివరించారు. సాకేత్ ఎప్పుడూ రివాల్వర్ ను క్యారీ చేస్తున్నాడని... బీహార్ గయాలో 45,000 దీన్ని కొన్నారని ఆయన తెలిపారు. సందీప్ కిడ్నాప్ వ్యవహారం ఇతర అంశాలపై కేసులు నమోదు చేస్తాం అని ఆయన వివరించారు. నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: