
అయితే మీకు తెలిసి ఇది ఎన్ని రకాల సమస్యలకు వైద్యం చేయగలదు చెప్పండి. విటమిన్ల లోపం, ఆర్థరైటిస్, రక్తహీనత, శృంగారం, సంతాన సమస్యలకు ఉపయోగపడుతుంది. అంతే కాదు నిజానికి.. మునగాకు దాదాపు 300 వ్యాధులను నయం చేయగలదట. ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవును ఇది నిజం. అందుకే మునగ చెట్టును చాలా మంది.. ‘మిరాకిల్ ట్రీ’ అని పిలుస్తారు. మునగకాయల్లో ఉండే విటమిన్ సి అనారోగ్య రుగ్మతలను దూరం చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి మునగ ఎంతో మేలు చేస్తుంది. మునగకాయలను వారానికి ఐదుసార్లు తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక సాధారణంగా మునగాకు, మునగకాయల వినియోగం జుట్టు రాలడం, మొటిమలు, రక్తహీనత, విటమిండిఫిషియెన్సీ, తక్కువ రోగనిరోధక శక్తి, ఆర్థరైటిస్, దగ్గు, ఉబ్బసం తదితర సాధారణ సమస్యలలో ఉపయోగపడుతుంది. వీటిలో చాలా రకాల ఆరోగ్యకరమైన సమ్మేళనాలు ఉన్నాయి. అవేంటంటే.. విటమిన్ ఎ, విటమిన్ బి 1 (థియామిన్), బి 2 (రిబోఫ్లేవిన్), బి 3 (నియాసిన్), బి -6, ఫొలేట్, ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి), కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, జింక్. వీటితో పాటు మునగలో యాంటీబయాటిక్, అనాల్జేసిక్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిక్యాన్సర్, యాంటీడియాబెటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీగేజింగ్‌గా లక్షణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.