అది రాజుల కోట‌. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి కంచుకోట‌. అలాంటి చోట .. క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ సామాన్య పూజారి.. పంచాయ‌తీ స‌ర్పంచ్‌గా సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ఉండి నియోజ‌క‌వ‌ర్గం క్ష‌త్రియుల‌కు ప‌ట్టుకొమ్మ‌. తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఈ వ‌ర్గానికి చెందిన వారే ఎక్కువ‌గా ఇక్క‌డ పోటీ చేశారు. గ్రామాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిం చారు. ఇలానే.. కాళ్ల మండ‌లం.. కొల‌న్న‌ప‌ల్లి గ్రామ పంచాయ‌తీని కూడా క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం సొంతం చేసుకోవాల‌ని చూసింది.

ఈ క్ర‌మంలోనే క్ష‌త్ర‌య సామాజిక వ‌ర్గానికి చెందిన వేగేశ్న కృష్ణం రాజు బ‌రిలోకి దిగారు. అయితే.. కొల‌న్న‌ప‌ల్లి గ్రామంలోని రామాల‌యంలో పూజారిగా ఆధ్యాత్మిక రంగంలో సేవ‌లందిస్తున్న కొన‌కంచి సూర్య‌‌నారాయ‌ణ మూర్తి కూడా సర్పంచ్ ప‌ద‌వికి నామినేష‌న్ వేశారు. వాస్త‌వానికి ఇప్ప‌టికి రెండు సార్లు ఆయ‌న ఇక్క‌డ పోటీ చేసి.. ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌ట్టు వీడ‌కుండా.. ముచ్చ‌ట‌గా మూడో సారి కూడా పోటీకి దిగారు. వాస్త‌వానికి క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచిన కృష్ణంరాజుతో పోల్చుకుంటే.. ఆర్థిక‌, అంగ‌బ‌లాలు లేని  కొన‌కంచి సూర్య‌‌నారాయ‌ణ మూర్తి పై క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం ఒత్తిళ్లు తీసుకువ‌చ్చింది.

స‌ర్పంచ్‌గా నామినేష‌న్‌నువెన‌క్కి తీసుకోవాల‌ని బెదిరించారు. దీంతో విధిలేక ఒకానొక ద‌శ‌లో ఆయ‌న నామినేష‌న్‌ను వెన‌క్కి తీసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే.. కొంద‌రి ప్రోత్సాహంతో ఆయ‌న మ‌న‌సు మార్చుకుని బ‌రిలో నిలిచారు. కృష్ణంరాజు వ‌ర్గం ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచారు. అనేక ప్ర‌లోభాల‌కు గురి చేశారు. సూర్య‌నారాయ‌ణ మూర్తి మాత్రం.. కేవ‌లం 5500 రూపాయ‌లు మాత్ర‌మే ఖ‌ర్చు చేయ‌గ‌లిగారు. అది కూడా క‌ర‌ప‌త్రాల ముద్ర‌ణ‌కు ఇత‌ర‌త్రా చిన్న‌పాటి ఖ‌ర్చుల‌కు కేటాయించారు. ఆయ‌నే స్వ‌యంగా ఇంటింటికీ తిరిగి ప్ర‌చారం చేసుకున్నారు.  

ఎన్ని బెదిరింపులువ‌చ్చినా.. వెన‌క్కి త‌గ్గకుండా ప్ర‌జ‌ల‌నే న‌మ్ముకున్నారు. ఇక‌, ఈ గ్రామంలో 1814 మంది ఉన్న జ‌నాభాలో 1362మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో 608 మంది సూర్య‌నారాయ‌ణ‌మూర్తికి ఓటేయ‌గా.. వేగేశ్న కృష్ణంరాజుకు 433 ఓట్లు మాత్ర‌మే రావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, 33 ఓట్లు చెల్ల‌కుండా పోయాయి. మొత్తానికి క్ష‌త్రియుల కంచుకోట‌లో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన సూర్య‌నారాయ‌ణ‌మూర్తి.. ప‌ట్టుద‌ల‌తో పోరాడి.. 186 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959
 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: