స్పైడర్ మాన్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ విషయంలో జరుగుతున్న ప్రచారమే పబ్లిసిటీ గా మారింది. ఈ సంవత్సరం చివర్లో రాబోయే సినిమా అసలు  ఎన్నో సీక్వెల్? దానికి  టైటిల్ ఏమి పెడుతున్నారు అనే  ప్రచారంలో భాగంగా ఎన్నో రకాల  టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి.1977 నుంచీ స్పైడర్ మ్యాన్ అటు బుల్లి తెరపై, ఇటు వెండితెరపై కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. అలాగే 2002 నుంచీ 2007 మధ్య మూడు స్పైడర్ మ్యాన్ సినిమాలొచ్చాయి. వీట్ని 'స్పైడర్ మ్యాన్' వన్, టూ, త్రీగా వ్యవహరిస్తారు. తరువాత 2012, 2014లో 'ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్' వన్ అండ్ టూ వర్షన్స్ రిలీజ్ అయ్యాయి.అయితే, 2017లో మరో సూపర్ స్పైడర్ సిరీస్ మొదలైంది. 'స్పైడర్ మ్యాన్.. హోమ్ కమింగ్' అనే  పేరుతో మూవీ రిలీజ్ అయ్యి కలెక్షన్ల పరంగా బారి లాభాలు తెచిపెట్టింది.


అలాగే మళ్ళీ దీనికి  సీక్వెల్ గా  2019లో విడుదలైన 'స్పైడర్ మ్యాన్ : ఫార్ ఫ్రమ్ ద హోమ్' సినిమాకి సీక్వెల్ ప్రస్తుతం తెరకెక్కుతోంది. ఈ సినిమాని 'స్పైడర్ మ్యాన్ 3' అనాలో లేక మరేమి అనాలో  అర్థం కావటం లేదు.ఎందుకంటే, 2007లో విడుదలైన చిత్రాన్ని 'స్పైడర్ మ్యాన్ 3' అనే వ్యవహరించారు. అయితే ఇప్పుడు 2021లో రాబోతోన్నది 2017, 2019 సినిమాలకి సీక్వెల్. కాబట్టి ఇది కూడా మూడోదేనా లేక మంరేంటి.?  అన్నా ప్రశ్న అందరిలోనూ వస్తుంది..


అలాగే సినిమా టైటిల్ విషయంలో కూడా కన్ఫ్యూషన్ వీడడం లేదు. సోషల్ మీడియాలో రకరకాల పేర్లు పుకార్లు చేస్తున్నాయి.  వాటిల్లో ఒకరు తమ సినిమా టైటిల్ 'స్పైడర్ మ్యాన్ : ఫోన్ హోమ్' అన్నారు. ఇంకొకరు 'స్పైడర్ మ్యాన్ : హోమ్ రెకర్' అని ప్రకటించారు.స్పైడర్ మ్యాన్ : హోమ్ స్లైస్' అంటూ మరోక టైటిల్ కూడా సినిమా యూనిట్ సభ్యుల్లో ఒకరే ఆన్ లైన్లో ప్రచారం చేస్తున్నారు! ఇన్ని టైటిల్స్ చూసిన నెటిజన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ కన్ఫ్యూషన్ వీడాలంటే  దర్శకనిర్మాతలు తమ అఫీషియల్ టైటిల్ పై క్లారిటీ ఇవ్వవలిసి వుంది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: