పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫిరోజాబాద్ జిల్లాలోని తుండ్లా తహసీల్ గ్రామం చికావు. అక్కడ 38 మంది సభ్యులతో ఉన్న దీక్షిత్ కుటుంబం నివసిస్తోంది. ఆ గ్రామ పెద్ద బ్రహ్మదత్త దీక్షిత్‌ను ఎన్నికల శత్రుత్వంతో కాల్చి చంపెశారు. తరువాత ఆయన నాలుగో కుమారుడు వినోద్ దీక్షిత్ ఊరి పెద్దతో పాటు ఇంటికి కూడా పెద్దగా నిలిచారు. తన సోదరులందరితో కలిసి, కుటుంబాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. 2,674 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంటిలో ఆయన, ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులు మొత్తం 38 మంది కలిసి ఉంటున్నారు.

ఇక ఈ కుటుంబంలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. వారు వారి పనులను కూడా పంచుకొని చేస్తుంటారు.ఇక కుటుంబం మొత్తానికి ముగ్గురు వంట చేస్తారు. మరో ముగ్గురు మహిళలు ఇంటిలో ఉండే పాడిని చూసుకుంటారు, మిగిలిన ముగ్గురు మహిళలు ఇంటికి సంబంధించిన బట్టలు ఉతకడం వంటి ఇతర ఇంటి పనులను నిర్వహిస్తారు. ఇంట్లో ప్రతి ఒక్కరి బాధ్యతలు సక్రమంగా ఎవరికీ వారు చేసుకుంటారు. వారు ఉదయం మేల్కొన్న వెంటనే, ప్రతి ఒక్కరూ తమ పనిని చేసుకోవడంలోనే నిమగ్నమవుతారు.
అయితే నీరజ్ దీక్షిత్ వ్యవసాయం, ఊరిలో చిన్న వ్యాపారం చేస్తారు. తన పెద్ద సోదరులు ప్రమోద్ దీక్షిత్, మనోజ్ దీక్షిత్, పవన్ దీక్షిత్ ఢిల్లీలో ఉద్యగం చేస్తూ నివసించేవారు. కరోనా ప్రారంభమైనప్పటి నుండి వారు కూడా తమ ఇంటికి వచ్చేసారు. అప్పటి నుండి అందరూ గ్రామంలోనే ఉంటున్నారు. వ్యవసాయంతో పాటు, ఇతర వ్యాపారం చేయడం ద్వారా తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ, అందరూ కలిసే ఉంటారు. వంట ఇంటిల్లిపాదికీ కలిసి ఒకే పోయ్యిమీదే జరుగుతుందని నీరజ్ చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి