ఇటీవలే హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఈ ఘటనపై అటు రాష్ట్ర ప్రజానీకం మొత్తం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. నిందితుడికి వెంటనే ఉరి శిక్ష వేయాలి అంటూ అందరూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా పోలీసులు నిందితుడు రాజు ని పట్టుకోవడంలో విఫలం అవుతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ పోలీసులు కూడా మునుపెన్నడూ లేనంత భారీ స్థాయిలోనే నిందితుడు రాజుని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.



 తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి మంది పోలీసులు రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. రాజు ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల రివార్డ్ కూడా ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలనె ఉద్దేశంతో అన్ని ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో కూడా తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో తప్పుడు ప్రచారాలు కూడా ఊపందుకున్నాయి. అయితే ఇటీవలే అత్యాచారం హత్య నిందితుడు రాజు కథ ముగిసింది. ఘట్కేసర్ వరంగల్ స్టేషన్ గన్పూర్ మండలం రైల్వే ట్రాక్ ఫై విగతజీవిగా కనిపించాడు రాజు.  ఇది ప్రభుత్వం పని అని కొందరు అంటుంటే మనస్థాపం చెంది రాజు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మరికొందరు అంటున్నారు.  దీంతో ప్రస్తుత రాజుది హత్య ఆత్మహత్య అనే దానిపై గందరగోళ పరిస్థితి నెలకొంది.


 అయితే అటు నిందితుడు రాజు కుటుంబీకులు మాత్రం రాజు ని పోలీసులు హత్య చేశారు అంటూ ఆరోపిస్తున్నారు. ఇక రాజు  మృతి పై స్పందించిన  రాజు తల్లి షాకింగ్ కామెంట్స్ చేసింది. తన కొడుకుది ఆత్మహత్య కాదని పోలీసులు చంపేశారు అంటూ ఆరోపించింది. నా కొడుకు మూడు రోజుల కిందటే అడ్డ గూడూరు లో పోలీసులకు దొరికిపోయాడు. ఇక ఇప్పుడేమో తమకు దొరకలేదని ఆత్మహత్య చేసుకున్నాడు అని చెబుతున్నారు పోలీసులు. పోలీసులే ఉరికించి తన కొడుకుని కాల్చిచంపారు అంటూ రాజు తల్లి ఆరోపించింది. ఆ బాలిక తల్లిదండ్రుల కడుపు కాలింది కాబట్టి నా కొడుకుని చంపేసి న్యాయం చేశారు. ఇక ఇప్పుడు మాకు కూడా న్యాయం చేయండి అంటూ ఆమె కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: