రాష్ట్రంలో యువ‌త‌కు అన్ని పార్టీలూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ విష‌యంలో ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేదు. ప్ర‌తి పార్టీ కూడా యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నిజానికి ఇప్ప‌టికే వైసీపీ యువ నాయ‌కుల‌కు ప్రాధాన్యం ఇచ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు ముక్కు మొహం తెలియ‌న వారిని కూడా తీసు కువ‌చ్చి టికెట్లు ఇచ్చి.. గెలిపించుకుంది. ఇక‌, టీడీపీ కూడా గ‌త ఎన్నిక‌ల్లో యువ‌త‌కు టికెట్లు ఇచ్చింది. అయితే.. అంద‌రూ వార‌సుల‌కే చంద్ర‌బాబు టికెట్లు ఇచ్చార‌నే అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకున్నారు. దీంతో పార్టీ కోసం శ్ర‌మించిన యువ‌త‌.. దాదాపు పార్టీకి దూర‌మ‌య్యారు. దీంతో మ‌ళ్లీ.. యువజ‌పం చేస్తున్నారు. కానీ.. ఈ సారి కూడా వార‌సులే ఎక్కువ‌గా ఉన్నారు.

అయితే.. టీడీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వార‌సులు కూడా చాలా మంది విజ‌యానికి దూర‌మ య్యారు. ఒక్క కింజ‌రాపు ఇంటి ఆడ‌ప‌డుచు భ‌వానీ త‌ప్ప‌.. ఎవ‌రూ విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. మ‌రి ఇప్పుడు ముంద‌స్తు వ‌స్తే.. యువత ప‌రిస్థితి ఏంటి?  అనేది టీడీపీలో ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింది. మ‌రోవైపు.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కూడా.. యువ‌త‌కు పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చింది. అయితే.. ఒక్క‌రు కూడా గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. మ‌రి ఇప్పుడు అస‌లు యువ‌త కూడా టికెట్లు తీసుకునేందుకు ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో అటు వైసీపీలో యువ‌త జోరుగా ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో మాత్రం సాధార‌ణ యువ‌త బిక్కుబిక్కుమంటూనే ఉంది. ``ఎన్నిక‌లు వ‌చ్చినా.. మాకు ప్రాధాన్యం ద‌క్కేది లేదు బ్రో!`` అంటున్నారు టీడీపీ యువ నాయ‌కులు. చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ‌త‌.. పార్టీకి దూరంగా ఉంటోంది. ఉన్న‌వారిలోనూ.. ఆర్థికంగా చూసుకుంటే.. పేద‌వ ర్గాల‌కు చెందిన వారే. ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చి.. అధిష్టాన‌మే గెలిపించుకోవాల్సిన లేదా .. ఆర్థిక సాయం చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. అయితే.. ఎంద‌రికి ఇలా చేస్తారు? అనేది ప్ర‌శ్న‌. ఈ క్ర‌మంలో మ‌రోసారి.. అన్ని జిల్లాల్లోనూ.. వార‌సుల‌కే ప్రాధాన్యం ద‌క్కేలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, జ‌న‌సేన విష‌యాన్ని చూసుకుంటే.. గ‌త ఎన్నిక‌ల‌కుముందు ఉన్న హ‌వా ఇప్పుడు జ‌న‌సేన‌లో క‌నిపించ‌డం లేదు. యువ‌త‌ను ప్ర‌త్యేకంగా ప్రోత్స‌హిస్తున్నాన‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో చాలా మంది వ‌చ్చి చేశారు. కానీ, త‌ర్వాత‌.. పార్టీ నుంచి వారికి స‌రైన సాయం అంద‌లేదు. దీంతో ఎందుకొచ్చిన రాజ‌కీయం అనుకుని త‌ప్పుకొన్నారు. ఇప్పుడు చూద్దామ‌ని అనుకున్నా..ప‌ట్టుమ‌ని ఓ యాభై మందైనా.. పోటీ చేసేందుకు యువ‌త క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ముంద‌స్తుకు యువ‌త సిద్ధ‌మేనా .. బ్రో!! అంటే.. వైసీపీ త‌ప్ప మిగిలిన పార్టీల్లో మౌన‌మే స‌మాధానంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: