
ఒకప్పుడు ఆధిపత్యం కోసం ప్రత్యక్ష యుద్దాలు జరుగుతుండేవి, ఇప్పుడు ట్రెండ్ మారి వాణిజ్య యుద్ధాల రూపం వచ్చేసింది. అనంతరం ఆర్థికంగా దేశాలను ప్రభావితం చేసి ఆయా దేశాలను ఆడుకున్నట్టుగా అక్కడ పెట్టుబడులు పెట్టి వాటిని మెల్లిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ఇప్పటి ట్రెండ్. ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తున్న సంక్షోభం కూడా అలాంటిదే. అయితే ఇది కొన్ని దేశాలు కలిసి చేయడం జరిగింది కాబట్టి గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే అందరూ భుజాలు తడుముకుంటున్నారు. లేదు ఇదంతా చైనా మాత్రమే చేసి ఉంటె ఇప్పటికే ఆ దేశం లేకుండా చేసే పెద్దన్న లాంటివారి దూకుడు తెలియనిదేమి కాదు. అలాంటివారు నిదానంగా ఉన్నారంటే ఈ సంక్షోభం వారి పుణ్యమే అని తెలుస్తూనే ఉంది.
ఈ ఏడాది మయన్మార్ లో కూడా ప్రభుత్వం స్పష్టమైన పాలన అందిస్తున్నప్పటికీ సైనిక తిరుగుబాటు జరిగింది. ఇది అక్కడ సహజమే అయినప్పటికీ ప్రపంచానికి మాత్రం కారణాలు తెలిసివచ్చాయి. ఇక మరో ఆక్రమణ ఆఫ్ఘన్ దేశం తాలిబన్ ల హస్తగతం అవడం. అలాగే ఇదే సమయంలో గినియా దేశాన్ని కూడా సైన్యం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. మరో ఆఫ్రికన్ దేశం సూడాన్ లో కూడా సైనిక తిరుగుబాటు జరిగింది. అయితే ప్రభుత్వ అనుకూల దళాలు దానిని తిప్పికొట్టడంతో ముప్పు తప్పినట్లయింది. తిరుగుబాటు దారుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి సమస్యను అణిచివేయడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఈ తిరుగుబాటుతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇక్కడ రెండు సంవత్సరాల క్రితం ఒమర్ బషీర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది, దీనితో మూడు దశాబ్దాల పీడిత పాలనకు పరిష్కారం దొరికింది.