రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కార్‌ ను కూల్చేందుకు వైయస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల కిందట ప్రారంభమైన వైఎస్‌ షర్మిల పాదయాత్ర... శంషాబాద్ మండలం కాచారంలో మొదలై పోశెట్టిగూడెం వరకు 12 కిలోమీటర్లు వరకు సాగింది. కాచారం, సుల్తాన్ పల్లి, నర్కుడ, అమ్మపల్లి టెంపుల్, ఒయాసిస్ స్కూల్ ఊట్ పల్లి, రాళ్ళగూడ,  శంషాబాద్ బస్టాండ్ మీదుగ సాగింది పాదయాత్ర.   అయితే... శంషాబాద్ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల.  

ఉప ఎన్నిక కోసమే దళిత బంధు  పథకం తీసుకు వచ్చారని కేసీఆర్‌ పై ఫైర్‌ అయ్యారు వైఎస్ షర్మిల.  దళితులను మోసం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చూస్తున్నారని... హైదరాబాద్ కి దగ్గరగా ఉన్న శంషాబాద్ లో విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫైర్‌ అయ్యారు వైఎస్ షర్మిల.  111 కారణంగా శంషాబాద్ ఎంతో వెనుకబాటు గురైందని పేర్కొన్న షర్మిల... ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో 111 జీవో రద్దు పై హామీ ఇచ్చారు ఇప్పటికి అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. 

తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయని.. ఒక వేళ లేవని నిరూపిస్తే.. ముక్కు నేలకు రాస్తానని సీఎం కేసీఆర్‌ కు సవా ల్‌ విసి రా రు.  ధర ణి పోర్ట ల్ రైతులకు శాపంగా మారిందని పేర్కొన్న వైఎస్ షర్మిల..  చిన్న పొరపాటులో ఉన్న భూములను సవరించే లేక రైతులు చా లా ఇబ్బందు లు పడుతున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డ్వాక్రా మహిళలకు వడ్డీరహిత రుణాలు అందించి ప్రతి మహిళలకు ఎంతో తోడ్పాటు అందించారని వివరించారు వైఎస్ షర్మిల. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. అతి త్వర లోనే ప్రజలు బుద్ది చెబుతారని వెల్లడించారు వైఎస్ షర్మిల.

మరింత సమాచారం తెలుసుకోండి: