రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య రాజ‌కీయాలు పుంజుకున్నాయా?  ఆయ‌న రాజ‌కీయంగా దూకుడు మ‌రింత పెరుగుతుందా? ఇదీ.. ఇప్పుడు.. టీడీపీ వ‌ర్గాల్లో సాగుతున్న చ‌ర్చ‌. ఎందుకంటే.. ఇటీవ‌ల ఆయ‌న ఆస‌క్తిక‌రంగా పార్టీపై తిరుగుబాటు చేసినంత ప‌ని చేశారు. అలిగారు.. రాజీనామా అన్నారు.. కొంత మేర‌కు హ‌డావుడి చేశారు. అయితే.. ఈ విష‌యంలో వెంట‌నే జోక్యం చేసుకున్న చంద్ర‌బాబు గొడ‌వ స‌ర్దుమ‌ణిగేలా చేశారు. దీంతో అంతా స‌ర్దుకున్న‌ట్టేనా.. బుచ్చ‌కు ప్రాధాన్యం పెరిగిన‌ట్టేనా..?  ఇక‌, పార్టీలో ఆయ‌న‌కు వాల్యూ పెరుగుతుందా? అనే చ‌ర్చ ఇటీవ‌ల కాలంలో రాజ‌మండ్రి వ‌ర్గాల్లో ఎక్కువ‌గా సాగుతోంది.

అయితే.. అలా ఏంలేదు. బుచ్చ‌య్య ప‌రిస్థితి మామూలే.. అనేవారు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. దీనికి కార‌ణం ఏంటంటే.. ఆయ‌న‌పై ఎన్టీఆర్ వ‌ర్గం అనే ముద్ర ఉంది. పార్టీలో త‌లెత్తిన సంక్షోభం స‌మ‌యంలో ఎన్టీఆర్ వైపు మొగ్గుచూపిన వారిలో బుచ్చ‌య్య ఒక‌రు. అయితే.. ఆ త‌ర్వాత‌.. చంద్ర‌బాబుకు అనుకూలంగా చ‌క్రం తిప్పినా.. ఆయ‌న‌కు బాబు ద‌గ్గ‌ర మార్కులు ప‌డలేదు. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబు బుచ్చయ్య‌ను న‌మ్మ‌లేక పోవ‌డ‌మే అనే వాద‌న ఉంది. ఇక‌, అదే స‌మ‌యంలో బుచ్చ‌య్య కూడా బాబును విశ్వ‌సించ‌ర‌ని.. ఒక‌రిపై ఒక‌రికి న‌మ్మ‌క‌మే శ‌త్రువు అని అంటున్నారు.

అదే స‌మ యంలో కొంద‌రు మాత్రంబుచ్చ‌య్య గ్రాఫ్ పెరిగింద‌ని.. అంటున్నారు. ఇటీవ‌ల చేసిన హ‌డావు డితో బుచ్చ‌య్య గ్రాఫ్ పుంజుకుంద‌నిచెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల బాబు దీక్ష స‌మ‌యంలో ఆయ‌న‌ను కూడా పిలిచార‌ని అంటున్నారు. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా.. బుచ్చ‌య్య‌.. వృద్ధాప్యంలో ఉన్న నాయ‌కుడు కాబ‌ట్టి.. ఆయ‌నకు గ్రాఫ్ పెరిగినా.. త‌రిగినా ప్ర‌యోజ‌నం ఏంట‌ని అంటున్నారు. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి దిగుతారా?  లేదా? అనే ది కూడా సందేహంగానే ఉంద‌న్నారు. మొత్తానికి బుచ్చ‌య్య రాజ‌కీయాల‌పై.. ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. చివ‌రికి బుచ్చ‌య్య ఈ చ‌ర్చ‌పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: