ఇవాళ నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు మార్గదర్శకాలు జారీ చేసారు అని హై కోర్టు పేర్కొంది. పబ్‌లు, బార్లలో వేడుకల సమయాన్ని కరోనా, ఒమిక్రాన్ సంభవిస్తున్న దృష్ట్యా మరింత పెంచారు అని లాయర్లు కోర్టుకు వివరించడంతో.. కోర్టు మాత్రం నూతన సంవత్సర వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేము అని స్పష్టం చేసింది. ఢిల్లీ, మహారాష్ట్రల మాదిరిగా ఆక్షలు విధించాలని లాయర్లు కోరారు.
అయితే పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయని, హైకోర్టు రాష్ట్రంలో వంద శాతం మొదటి డోస్ పూర్తయిందని, రెండో డోస్ పంపిణీ కూడా 66 శాతం దాటినట్టు పేర్కొంది. మరోవైపు కరోనాపై విచారణను హైకోర్టు జనవరి 04 వరకు వాయిదా వేసినది. హై కోర్టు మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై చర్యలను తెలపాలని.. ఉల్లంఘనదారులపై తీసుకున్న చర్యలపై నివేదిక అందించాలని ఆదేశించింది.
మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా మద్యం సేవించి వాహనాలను నడపరాదంటూ.. పబ్బుల ముందు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా పబ్బుల్లో ఉండే సిబ్బందికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను తప్పకుండా చేయాలని సూచించింది. పబ్బుల నుంచి బయటకు వచ్చిన వారు తిరిగి వాహనం నడిపితే.. మాత్రం నిర్వహకులదే బాధ్యత. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. రాత్రి 10 గంటల సమయం నుంచి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి శబ్దాలు ఉండరాదు అని ఓ న్యాయవాది కోర్టుకు వివరించారు. నివాస ప్రాంతాల్లో ఉండే పబ్బుల్లో మాత్రం శబ్దం 45 డెసిబుల్స్ మించకుండా చర్యలు తీసుకోవాలని వివరించారు. ఆంక్షలను ఉల్లంఘిస్తున్న వారిపై తీసుకున్న చర్యలపై నివేదిక కూడా ఇవ్వాలని ఇవాళ కోర్టు ఆదేశించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి