ఎంతవారలైనా కాంతా దాసులే అంటాడు ఓ వాగ్గేయ కారుడు.. ఆయన మాటను నిజం చేసే ఘటనలు అనేకం ఉన్నాయి. చివరకు అమెరికా అధ్యక్షుడైనా మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌ అయినా కాంతామణికి దాసోహం కావాల్సిందే.. ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ పైనా
మహిళను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌పైనా తన కంపెనీలో ఉద్యోగిని వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి.


అయితే.. ఇది పాత వార్తే.. ఆ విషయం బయటకు వచ్చి చాలా ఏళ్లు గడిచిపోయాయి. అయితే ఇప్పుడు షాకింగ్ ఏంటంటే.. ఆ లైంగిక ఆరోపణల వివరాలను మైక్రోసాఫ్ట్ బయటపెట్టాలని నిర్ణయించిందట. అంటే కేవలం బిల్ గేట్స్‌ విషయం మాత్రమే కాదు.. మైక్రోసాఫ్ట్‌ సంస్థలో వచ్చిన ఇలాంటి ఆరోపణల వివరాలను బయటపెట్టాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.


2019 తర్వాత మైక్రోసాఫ్ట్‌లోని అనేక మంది ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అందుకే ఇలాంటి లైంగిక వేధింపులు, లింగ వివక్ష, వంటి ఫిర్యాదులపై కంపెనీ విధానాల్ని మైక్రోసాప్ట్ సమీక్షించాలనుకుంటోంది. దీని కోసం ఓ కన్సల్టన్సీ సంస్థను కూడా నియమించాలనుకుంది. ఈ ఆరోపణలు నిజమా? కాదా? అనే విషయం తేల్చబోతోంది. అలాగే ముందు ముందు  ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలన్న విషయంపైనా ఓ విధానం నిర్ణయించబోతోంది.


అయితే.. ఈ పరిణామం ఇప్పుడు బిల్‌ గేట్స్‌కు ఇబ్బంది కరంగా మారింది. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ చైర్మన్‌ పదవి నుంచి 2020లోనే దిగిపోయాడు. అందుకు కారణం కూడా ఈ లైంగిక వేధింపుల అంశమే అన్న విషయం ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కింది. 2007లో కొందరు మహిళా ఉద్యోగులపై బిల్‌ గేట్స్ ఈ-మెయిల్స్‌ ద్వారా వేధించాడని ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన ఉమెనైజర్‌ అని, ఉద్యోగులతో ఆయన వ్యవహారం బావుండదని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బిల్‌గేట్స్‌ తో పాటు ఉద్యోగులందరి వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉండటం ఆయనకు షాకింగ్‌గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: