మాజీ మంత్రి కర్నూలుకు చెందిన భూమా అఖిల ప్రియ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారట.ఇక ఇప్పుడు ఈ విషయం కర్నూలు జిల్లాలో జోరుగా సాగుతూ పెద్ద చర్చనీయాంశం అయింది. ఇక పూర్తి విషయంలోకి వెళ్తే.. తనకు తాను ఫైర్బ్రాండ్గా చెప్పుకొనే ఈ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు ఈమధ్య కాలంలో పార్టీలో గుర్తింపు అనేది తగ్గింది. ఆమెను ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.హైదరాబాద్లో కేసులు ఇంకా అలాగే స్థానికంగా టీడీపీ నేతలతో ఉన్న విభేదాలు కారణంగా.. చంద్రబాబు నాయుడు ఆమెను పట్టించుకోవడం మానేశారు.ఇక దీంతో ఇప్పుడు ఆమె  ఏదో ఒకటి చేసి.. ఎలాగైనా వార్తల్లో నిలవాలని కోరుకుంటున్నారట. ఈ క్రమంలోనే అఖిల ప్రియ కూడా సెన్సేషనల్ కామెంట్ చేశారు. తాను పార్టీకి రాజీనామా చేస్తానని అనౌన్స్ చేశారు.ఇక ఆళ్లగడ్డలో అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారన్న అఖిలప్రియ.. ఈ అవినీతిని ఖచ్చితంగా నిరూపిస్తానని.. కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నారు. అయితే.. ఈ కామెంట్స్ ని ఎవరూ కూడా పట్టించుకోలేదు. పైగా..ఆమె సొంత పార్టీ నాయకులే దీనిని పక్కన పెడుతూ వచ్చారు.


ఇక ఈ క్రమంలో రాజకీయాలకు గుడ్బై చెబుతానని ఆమె ప్రకటించారు. ఆమె చేసిన ప్రకటనతో అంటే.. అధికార పార్టీ నేతలపై విరుచుకుపడడంతో తనకు టీడీపీ నాయకులు అనేవారు కలిసి వస్తారని ఇంకా తనను హైలెట్ చేస్తారని  భూమా ఊహించుకుని ఉంటారు.కానీ ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే.. వచ్చే ఎలక్షన్స్ లో ఆమె మూడు నియోజకవర్గాలు కావాలని.. ఇప్పటి నుండే పట్టు బట్టడం.. ఇంకా అలాగే పార్టీలో సీనియర్లను పక్కన పెట్టడం.. ఇంకా అలాగే వివాదాల చుట్టూ రాజకీయాలు అల్లుకోవడం..అలాగే ఎవరినీ లెక్కచేయక పోవడం.. లాంటి కారణాలు.. ఆమెను పార్టీలో ఒంటరిని చేయడం అనేది జరిగింది.ఇక ఈ నేపథ్యంలో ఎవరూ కూడా ఆమెతో కలిసి రావడం లేదు. ఈ క్రమంలోనే భూమా అఖిల ప్రియ చివరి అస్త్రంగా.. రాజీనామా అనే ఈ అస్త్రం ఎంచుకున్నారని అంటున్నారు. అయితే ఇక ఇది నిజమైన ప్రకటన మాత్రం కాదని..కేవలం చంద్రబాబు నాయుడును బ్లాక్ మెయిల్ చేయడమేనని అంటున్నారు ఆమె సీనియర్ నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: