భారతదేశంలో పలు రాష్ట్రాలలో అనేక రకాల తెగలవారు నివసిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా అడవుల్లో నివసించే కొన్ని తెగల వారు ఇక రాజ్యాంగం కల్పించిన సౌకర్యాలలోనే బ్రతుకుతూ ఉంటే మరికొంతమంది మాత్రం ప్రపంచానికి దూరంగా వారి చిన్న ప్రపంచాన్ని నిర్మించుకుని అందులోనే జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అని చెప్పాలి.  ఇలా ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్న ఎన్నో తెగలకు సంబంధించిన కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక తెగ విచిత్రమైన సాంప్రదాయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 దేశంలో ఎన్నో తెగలు ఉన్న అటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల లో నివసిస్తున్న గోండు తెగ మాత్రం కాస్త ప్రత్యేకమైనది. అంతేకాదు ఇక ఈ తెగ అత్యంత పురాతనమైనది అని కూడా చెబుతూ ఉంటారు. ఇక ఎవరూ కలలో కూడా ఊహించని రీతిలో ఈ తెగ సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉంటాయి అని చెప్పాలి. ప్రజల జీవనం వారి వివాహం విషయంలో ఎన్నో ఆచారాలు పాటిస్తూ ఉంటారు ఈ తెగవారు. గోండు తెగల్లో పెళ్లి సమయంలో కొన్ని ఆచారాలు వింతగా ఉంటాయి. ఇందులో ఒకటి పంది రక్తం తాగడం.. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పెళ్ళికి అర్హుడు అని నిరూపించుకోవాలంటే అతను ముందుగా పంది రక్తం  తాగాలి. అంతేకాకుండా పెళ్లికి ముందే కాబోయే మామగారీ పొలంలో పని చేయాల్సి ఉంటుంది.


 పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కష్టపడి పని చేస్తున్నాడు అని నిర్ధారించుకున్న తర్వాత అతనికి తమ కూతురిని ఇచ్చి వివాహం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులు నిర్ణయిస్తారు.  అయితే ఈ తెగలో అటు ప్రేమవివాహానికి అస్సలు తావు ఉండదట.  ఇక పెళ్లి అంటే చాలు ఇక ఈ తెగ నివసించే ప్రాంతం మొత్తం పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రజలు అందరూ ఒకచోట చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారట. ఇకపోతే ఇలా పెళ్లికి ముందు వరుడితో పంది రక్తం తాగించడం అనే ఆచారం మాత్రం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: